డిస్కంకు లేఖ రాసిన ఎమ్మెల్యేకు రూ.కోటి

హామీల్ని నెర‌వేర్చ‌డానికి ప్ర‌భుత్వ ఖ‌జానాలో నిధులు లేవ‌ని సీఎం చంద్ర‌బాబు ప‌దేప‌దే చెప్తుంటారు. వైసీపీ ప్ర‌భుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించింద‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తుంటారు.

హామీల్ని నెర‌వేర్చ‌డానికి ప్ర‌భుత్వ ఖ‌జానాలో నిధులు లేవ‌ని సీఎం చంద్ర‌బాబు ప‌దేప‌దే చెప్తుంటారు. వైసీపీ ప్ర‌భుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించింద‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తుంటారు. సంప‌ద సృష్టించి, హామీల్ని నెర‌వేర్చ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని, ప్ర‌జ‌లు కూడా త‌మ‌ను అర్థం చేసుకోవాల‌ని ఈ మ‌ధ్య కాలంలో చంద్ర‌బాబు అన్న మాట‌లు తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. హామీల అమ‌లు అయ్యేప‌ని కాద‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి.

ఇవ‌న్నీ కాసేపు ప‌క్క‌న పెడితే, ప్ర‌భుత్వంలో పెద్ద‌లు భారీ స్థాయిలో దోపిడీకి పాల్ప‌డుతున్నార‌ని టీడీపీ అనుకూల ప‌త్రిక‌లో ఇవాళ క‌థ‌నం వెలువ‌డ‌డం గ‌మ‌నార్హం. పాల‌కులు దోచుకునేందుకు వంద‌ల కోట్లు అప్పులు చేయ‌డానికి కూడా వెనుకాడ‌ర‌ని, వాళ్ల‌ను గ‌ద్దెనెక్కించిన ప్ర‌జ‌లకు మాత్రం ఎదురుచూపులు, నిట్టూర్పులు త‌ప్ప‌డం లేద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

ఏ మాత్రం అవసరం లేకున్నా .. కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొత్త‌గా 33/11 కేవీ లైన్ వేసేందుకు రూ.343 కోట్లను పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ) నుంచి అప్పు తెచ్చి దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్‌) సిద్ధమైంద‌ట‌. పరికరాల కొనుగోలుకు ఎస్పీడీసీఎల్‌ టెండర్లు కూడా పిల‌వ‌డం చ‌ర్చ‌నీయాంశమైంది. ఇందులో మంత్రికి భారీ మొత్తంలో క‌మీషన్లు ముట్ట‌చెప్ప‌డానికి ముందే ఒప్పందం జ‌రిగింద‌నే స‌మాచారం విమ‌ర్శ‌లకు దారి తీసింది.

ఇందులో మ‌రో గ‌మ్మ‌త్తైన సంగ‌తి ఏంటంటే… ఈ మూడు జిల్లాల్లో లోవోల్టేజీ సమస్య కారణంగా బల్బులు కాలిపోతున్నాయని, విద్యుత్‌ ఉపకరణాలు చెడిపోతున్నాయంటూ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎస్పీడీసీఎల్‌కు లేఖ రాశారు. అయితే ఈ లేఖ‌లకు చాలా విలువ వుంద‌ని స‌ద‌రు ప‌త్రిక రాయ‌డం గ‌మ‌నార్హం. డిస్కంకు లేఖలు రాసిన ఎమ్మెల్యేలకు ఒక్కొక్క‌రికి రూ.కోటి ముట్టిన‌ట్టు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయ‌ని ఆ ప‌త్రిక రాయ‌డం విశేషం.

ఈ రేంజ్‌లో అవినీతి జ‌రుతుంటే, త‌మ‌ది మంచి ప్ర‌భుత్వం అని కూట‌మి పెద్ద‌లు ఏ ర‌కంగా ప్ర‌చారం చేసుకుంటున్నారో వాళ్ల‌కే తెలియాలి. గ‌తంలో వైసీపీ హ‌యాంలో కొంద‌రు విచ్చ‌లవిడిగా దోపిడీకి పాల్ప‌డ్డార‌ని, తామెందుకు ఆ ర‌కంగా చేయ‌కూడ‌ద‌ని, దీపం వుండ‌గానే ఇంటిని చ‌క్క‌దిద్దుకోవాల‌నే ఆలోచ‌న‌తో ప్ర‌జాప్ర‌తినిధులు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నేందుకు ఇదే నిద‌ర్శ‌నం. దోచుకునే వారికి దోచుకున్నంత‌… అన్న‌ట్టుగా అధికారంలోకి వ‌చ్చిన మొద‌లు, అదే ప‌నిలో చాలా మంది ప్ర‌జాప్ర‌తినిధులున్నారు.

9 Replies to “డిస్కంకు లేఖ రాసిన ఎమ్మెల్యేకు రూ.కోటి”

  1. హ! హ!! వంశి గాడికి కొర్ట్ 14 రొజులు రిమాండ్ విదించింది! ఆ వార్త రాయకుండా మొహం చాటెస్తున్న GA!!

  2. వాళ్ళు చేశారని ప్రచారం చేస్తారు.. వీళ్ళు నిజంగా చేస్తారు.. దొంగే దొంగ దొంగ అని అరవడం గురించి నీకు తెలీదా. ?

  3. వాళ్ళు చేశా రని ప్ర చా రం చే స్తారు.. వీళ్ళు నిజంగా చే స్తారు.. దొం గే దొం గ దొం గ అని అరవడం గు రించి నీ కు తెలీ దా. ?

Comments are closed.