నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని మంత్రి నారాయణ డమ్మీ చేశారనే చర్చ విస్తృతంగా సాగుతోంది. అందుకే మంత్రి నారాయణపై కోటంరెడ్డి రగిలిపోతున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి చట్టసభలో అడుగు పెట్టాలన్న కోటంరెడ్డి ఆకాంక్షను వైఎస్ జగన్ నెరవేర్చారు. ఆ తర్వాత వైఎస్ జగన్‌తో కోటంరెడ్డి విభేదించారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు టీడీపీలో చేరారు. నాడు మాజీ మంత్రి నారాయణ దగ్గరుండి టీడీపీకి దగ్గర చేశారు. అంత వరకూ కథ బాగానే నడిచింది.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కోటంరెడ్డికి కష్టాల మొదలయ్యాయి. తనకు ఏ మాత్రం విలువ ఇవ్వకుండా అవమానిస్తున్నారనే ఆవేదన కోటంరెడ్డిలో రోజురోజుకూ పెరుగుతోంది. నెల్లూరు కార్పొరేషన్‌లో మొత్తం 54 డివిజన్లు వుంటాయి. ఇందులో సగానికి పైగా డివిజన్లు నెల్లూరు రూరల్ పరిధిలో వుంటాయి. అంటే, కోటంరెడ్డి చేతిలో వుంటాయి. కానీ కోటంరెడ్డి మాట చెల్లుబాటు కావడం లేదని సమాచారం.
మున్సిపల్‌శాఖ మంత్రి అయిన నారాయణ మరొకరిని నెల్లూరు కార్పొరేషన్‌లో అడుగు పెట్టనివ్వలేదని తెలిసింది. దీంతో కోటంరెడ్డికి మంటగా వుంది. ఈ మధ్య ట్యాక్స్ విధింపును సాకుగా తీసుకుని నారాయణపై కోటంరెడ్డి పరోక్షంగా వ్యతిరేకత ప్రదర్శించారు. మంత్రి నారాయణ, కోటంరెడ్డి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరడంతో ఇటీవల వీళ్లిద్దరి పంచాయితీ సీఎం చంద్రబాబు చెంతకు చేరింది. కానీ విభేదాలు సమసిపోలేదు.
ప్రభుత్వం ఏర్పడి 8 నెలలకే నెల్లూరులో ఇలాంటి పరిణామాల్ని టీడీపీ నేతలెవరూ ఊహించలేదు. ప్రభుత్వంలో నారాయణ కీలకం కావడంతో కోటంరెడ్డి నిస్సహాయ స్థితిలో ఉన్నారు. నెల్లూరు కార్పొరేషన్‌లో కోటంరెడ్డి పనులేవీ కానట్టు తెలిసింది. తనకు తెలియకుండా కోటంరెడ్డి సిఫార్సులను పరిగణలోకి తీసుకోవద్దని మంత్రి నారాయణ కార్పొరేషన్ అధికారులకు సంకేతాలు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో వైసీపీలోనే తనకు గౌరవం వుండేదని సన్నిహితుల వద్ద కోటంరెడ్డి అంటున్నట్టు తెలిసింది. ఇదే రకంగా తనను డమ్మీ చేస్తే భవిష్యత్‌లో తిరుగుబాటు తప్పదని కోటంరెడ్డి హెచ్చరిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రానున్న రోజుల్లో మంత్రి నారాయణపై కోటంరెడ్డి ఎప్పుడైనా తిరుగుబాటు జెండా ఎగరేయొచ్చు.
ప్లే బాయ్ జాబ్స్ >>> తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది,
సరే లే అబ్బా సకల శాఖ ల మంత్రులని డమ్మీలు చేసే ప్రభుత్వ సలహాదారుడు కన్నా ఎమ్మెల్యే ని డమ్మి చేసే మినిస్టర్ మేలు కదా అబ్బా…(మినిస్టర్ ని ఎమ్మెల్యే డమ్మీ చేస్తే వార్త కానీ ..ఎమ్మెల్యే ని మినిస్టర్ డమ్మి చేయడం ఏంటి అబ్బా….??!!)
లాస్ట్ పేరా yedite ఉందొ అది హైలైట్….ఫాఫామ్..ఇద్దరు మధ్య విభేదాలు ఉంటె చంబా పిలిచి రాజీ ప్రయత్నం చేయడం గౌరవము తగ్గించినట్టు ఐతే..అనిల్ కి ప్రయారిటీ ఇస్తూ కనీసం అప్పోయింట్మెంట్ ఇవ్వకపోవడం ….వైసీపీ లో రాజా భోగం అనుభవించినట్టు …అవుతుందా
హ! హ!! వంశి గాడికి 14 రొజులు రిమాండ్! ఆ వార్త రాయకుండా మొహం చాటెస్తున్న GA!!
నోటి దూల తీర్చుకున్న ప్రతి వైసీపీ వెధవని వదలకండి
పోసాని
రోజా
కోడలి
ఈలి నాని
all should be being punished
narayana sir is a gem and works very hard for Nellore. These eddie leaders are only trouble makers with only the ability to make ruckus and seek money and favors. Narayana sir is doing the right thing here.
Hahaha avunu boss
రాబోయే రోజుల్లో బొల్లి గాడిపై పప్పు గాడు
పావలా గాడిపై స్నేక్ గాడు ఎదురు తిరగొచ్చు