దందాలను కట్టడి చేస్తే ఈ విధానం సూపర్

ముందు ప్రకటించిన ఫార్మేట్ లో కాకపోయినప్పటికీ కొన్ని మార్పు చేర్పుల తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రస్తుతం అమలులోకి తేనున్న ఉచిత ఇసుక విధానం చక్కగా ఉంది. Advertisement ప్రజలకు ఇసుక పూర్తి ఉచితంగా…

ముందు ప్రకటించిన ఫార్మేట్ లో కాకపోయినప్పటికీ కొన్ని మార్పు చేర్పుల తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రస్తుతం అమలులోకి తేనున్న ఉచిత ఇసుక విధానం చక్కగా ఉంది.

ప్రజలకు ఇసుక పూర్తి ఉచితంగా అందే ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రతిపక్షం నుంచి కొన్ని విమర్శలు వచ్చిన తర్వాతనైనా చేపట్టిన మార్పు చేర్పులతో ఎన్నికల నాటి హామీని మక్కీకి మక్కీగా నిలబెట్టుకున్నందుకు ప్రభుత్వాన్ని అభినందించాలి.

అయితే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లుగా ప్రభుత్వం ఎంత మంచి విధానం తీసుకువచ్చినప్పటికీ అందులో ఏదో ఒక విధంగా చొరబడి వక్రమార్గాలలో అక్రమార్జనలకు పాల్పడే ప్రబుద్ధులు అనేకమంది ఉంటారు.

అధికారంలో ఉన్న పార్టీ అండ చూసుకొని ఎమ్మెల్యేలకు వాటాలు ముట్టచెప్పుకుంటూ ఇలాంటి వారు దందాలు సాగిస్తూ బతుకుతారు.

కొత్త ఇసుక విధానం ఎంత బాగున్నప్పటికీ ఇలాంటి దందారాయుళ్ళు సరికొత్త దోపిడీ మార్గాలను వెతుక్కునే ప్రమాదం కూడా ఉంది.

అలాంటివి ఏమీ లేకుండా చూడడం… ఎక్కడైనా ఉచిత ఇసుక విధానానికి మచ్చ వచ్చేలాగా దందాలు జరుగుతూ ఉంటే సర్కారు అలాంటి వారి పట్ల పార్టీ రహితంగా కఠినంగా వ్యవహరించడం చేస్తే తప్ప ప్రభుత్వానికి మంచి పేరు దక్కదు. చంద్రబాబు తెచ్చిన విధానం ఎంత బాగున్నప్పటికీ ఆచరణలో దారి తప్పితే భ్రష్టు పట్టిపోయేది మాత్రం ప్రభుత్వమే.

పూర్తి ఉచితంగా ఇసుక లభ్యమయ్యే ప్రస్తుత విధానంలో సీనరేజీ సహా ఎలాంటి చార్జీలు కూడా ప్రజలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎక్కువ లోడ్ వేసుకున్నా సరే దానికి జరిమానాలు లేకుండా నిబంధనలు మార్చారు.

ఒక సగటు వ్యక్తి నేరుగా తన కోసం ఒక ట్రాక్టరును తీసుకువెళ్లి నదిలోనో, వాగులోనో ఇసుక తనే తవ్వి, ఎంచక్కా స్వయంగా ఆ ట్రాక్టరును నింపుకుని.. ఎవరికీ పైసా చెల్లించకుండానే వెళ్లిపోవచ్చు.

ఒకవేళ తాను స్వయంగా ఇసుక తవ్వి ట్రాక్టరులో నింపుకోలేకపోతే అక్కడ ఉండే కాంట్రాక్టరు ద్వారా ఆ పనిచేయించుకోవచ్చు. టన్నుకు రూ.90-100 ఇవ్వాలి. ఇదీ పద్ధతి. ఇది ఇంతే బాగా జరిగితే అంతా బాగానే ఉంటుంది.

కానీ వ్యక్తులు ట్రాక్టర్లు తీసుకుని వెళ్లినప్పుడు.. ఇక్కడ తవ్వడానికి వీల్లేదని వారిని బెదిరించడం.. నదుల్లో, వాగుల్లో ఇసుక ఉన్న ప్రాంతాలను తవ్వకం కాంట్రాక్టర్లు ఆక్రమించి.. ఇది మేం పాట పాడుకున్నాం.. మీరు తవ్వడానికి వీల్లేదు.. దూరంగా అక్కడు వెళ్లండి.. అంటూ సాధ్యంకాని చోట్లను చూపించడం.. తవ్వకం ఖర్చు, పన్నులు ఏమీ లేకపోయినా సరే.. లోకల్ ఎమ్మెల్యేల దందా ఇవ్వాల్సిందేనని వాళ్ల అనుచరులు దుడ్డుకర్రలు పట్టుకుని రీచ్ లవద్ద కాపలా కాయడం, వసూలు చేయడం వంటి దారుణాలు జరిగే అవకాశం ఉంది.

ఇసుక కోసం వెళ్లిన వారు విషయ పరిజ్ఞానం లేక, గొడవ పెట్టుకోవడం ఇష్టం లేక రకరకాల కారణాల వల్ల.. ఈ దందారాయుళ్లు అడిగే మొత్తాలు ఇచ్చేసి తెచ్చుకోవచ్చు. కానీ ఇలాంటి దందాలు జరిగితే మాత్రం ప్రభుత్వానికి పరువు పోతుంది.

మంచిగా ఉచిత విధానం తీసుకువచ్చినాసరే మచ్చ పడాల్సి వస్తుంది. అందుకే చంద్రబాబు సర్కారు ముందే జాగ్రత్త పడి, ఇలాంటివి కట్టడి చేస్తే వారికి మంచిది.

4 Replies to “దందాలను కట్టడి చేస్తే ఈ విధానం సూపర్”

  1. వ్యవస్థీకృతమైన కొన్ని విషయాలను ఎంత కట్టడి చేసినా స్థానికంగా కొన్ని ఓడి దుడుకులు తప్పవు, గ్రేటర్ గుడ్ జరిగితే అదే పది వేలు..

  2. Neelanti mundamopollaku ardam kavule Ayana vidaanaalu. Monntidaaka amaravathi mungipoyindi ani yedicharu. Ippudu Bangalore munigindi monna chennai munigindi, Mari akasam lo kadataaraa?

Comments are closed.