బొత్స‌కు అన్ని ద‌ర్శ‌నాలా… టీటీడీ ఈవోని బాబు తిట్టారాట‌!

మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సిఫార్సు లేఖ‌కు ఏకంగా 26 మందికి తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పించ‌డంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ట‌. గ‌తంలో వైసీపీ హ‌యాంలో బొత్స‌తో అనుబంధం ఉన్న…

మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సిఫార్సు లేఖ‌కు ఏకంగా 26 మందికి తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పించ‌డంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ట‌. గ‌తంలో వైసీపీ హ‌యాంలో బొత్స‌తో అనుబంధం ఉన్న టీటీడీ ఈవో… ఆ అభిమానంతో ఆయ‌న‌కు ఎక్కువ ద‌ర్శ‌నాలు ఇవ్వ‌డం గురించి చంద్ర‌బాబుకు ఫిర్యాదు చేయ‌డం, ఆయ‌న తిట్టార‌నే వార్త‌ను వెలుగులోకి తీసుకురావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఎమ్మెల్యే, ఎంపీ.. ఇలా ప్ర‌జాప్ర‌తినిధుల సిఫార్సు లేఖ‌పై రోజుకు ఆరుగురికి చొప్పున టీటీడీ ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పిస్తుంది. ఈ నేప‌థ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ సిఫార్సు లేఖ‌పై ఏకంగా 26 మందికి ద‌ర్శ‌నం క‌ల్పించ‌డంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఫిర్యాదు వెళ్ల‌డం గ‌మ‌నార్హం.

గ‌తంలో బొత్స స‌త్య‌నారాయ‌ణ విద్యాశాఖ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో అదే శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీగా ఐఏఎస్ అధికారి జే. శ్యామ‌ల‌రావు బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. బొత్స‌తో ఆ అనుబంధం రీత్యా నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ద‌ర్శ‌నాలు ఎక్కువ ఇచ్చార‌ని సీఎంవో దృష్టికి తీసుకెళ్ల‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో వైసీపీ ప్ర‌భుత్వంతో అంట‌కాగి, ఇప్పుడు కూడా ఆ పార్టీ నేత‌ల‌కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారంటూ టీడీపీ అనుబంధ మీడియాలో క‌థ‌నాలు రావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

పాత ప‌రిచ‌యాల పేరుతో వైసీపీ నేత‌ల‌కు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ప్రాధాన్యం ఇవ్వ‌డం ఏంట‌ని టీటీడీ ఈవో శ్యామ‌ల‌రావును మంద‌లించిన‌ట్టు స‌ద‌రు మీడియా రాసుకొస్తోంది. అయితే ద‌ర్శ‌నాల విష‌యాన్ని కూడా చంద్ర‌బాబు ప‌ట్టించుకుంటున్నారా? అనేది ప్ర‌శ్న‌. ఒక‌వేళ అదే నిజ‌మైతే చంద్ర‌బాబు ప్ర‌తి చిన్న విష‌యంపై కూడా స‌మాచారం తెప్పించుకుంటున్నార‌ని అనుకోవాలి.

5 Replies to “బొత్స‌కు అన్ని ద‌ర్శ‌నాలా… టీటీడీ ఈవోని బాబు తిట్టారాట‌!”

  1. ప్రతీ చిన్న విషయం మీద చంద్రబాబు సమాచారం తెప్పించు కోవడం కాదు, అలా పట్టుకెళ్లి ఇచ్చే కరటకులు, దమనకులు ఉన్నారు!

  2. అరే ఏమి జరుగుతుంది రా కూటమి ప్రభుత్వం లో .. మొన్న ఎన్నికల్లో గెలిచింది మనమే నా లేక మనము గెలిచినా ప్రభుత్వమూ వాళ్ళదేనా ? ఇలాంటివి ఇంకా ఇంకా చూస్తూ ఉంటె గెలిచిందెవరో, ప్రభుత్వం ఏర్పాటు చేసిందెవరో అర్థం అవ్వటం లేదు.. చిరాకు చిర్రు ఎత్తుకొస్తాది…

Comments are closed.