వైసీపీలో నంబ‌ర్ 2

చెవిరెడ్డి వైసీపీలో నంబ‌ర్ -2 స్థాయికి ఎదిగారంటే, దానికి కార‌ణం ఆయ‌న‌కు తీసుకోవ‌డం, ఇవ్వ‌డం అనే విద్య‌ను ఔపోస‌న ప‌ట్ట‌డ‌మే.

రాజ‌కీయాల్లో ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితులు మారుతుంటాయి. ఓడ‌లు బండ్లు, బండ్లు ఓడ‌లు అవుతుంటాయి. కాలం క‌లిసొస్తే అంద‌లం ఎక్కుతుంటారు. క‌లిసిరాక‌పోతే కింద‌ప‌డిపోతుంటారు. అయితే సాధించాల‌న్న ప‌ట్టుద‌ల వుంటే, ఏ స్థాయికైనా ఎద‌గొచ్చ‌ని చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి నిరూపించుకుంటున్నారు. మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఎలా ప‌ట్టుకున్నాడో తెలియ‌దు కానీ, వైసీపీలో ఇప్పుడు అత్యంత కీల‌క‌మైన నాయ‌కుడిగా చెవిరెడ్డి స్థానం సంపాదించుకున్నారు.

వైసీపీలో ఎవ‌రికైనా జ‌గ‌న్‌తో మాత్ర‌మే అనుబంధం వుంటుంది. కానీ చెవిరెడ్డికి మాత్రం వైఎస్ జ‌గ‌న్ కుటుంబ స‌భ్యుల‌ అభిమానాన్ని కూడా ద‌క్కించుకున్నారు. చెవిరెడ్డి ఎదుగుద‌ల చాలా మందికి అసూయ క‌లిగించొచ్చు. రాజ‌కీయాల్లో ఇలాంటివ‌న్నీ స‌ర్వ సాధార‌ణం. కానీ ల‌క్ష్య సాధ‌న‌లో ఒక్కో మెట్టు ఎక్కుతూ అని పాజిటివ్ కోణంలో చెబుతుంటారు. అయితే ఒక్కొక్క‌రినీ తొక్కుతూ చెవిరెడ్డి వైసీపీలో నంబ‌ర్ 2 పొజీష‌న్‌కు చేరుకున్నార‌ని అక్కసుతో అయినా నిజం చెప్పేవాళ్లు లేక‌పోలేదు.

చెవిరెడ్డి రాజ‌కీయ ప్ర‌స్థానంపై చాలా విమ‌ర్శ‌లున్నాయి. న‌మ్మిన వాళ్ల‌నే అణచివేస్తుంటార‌ని, ప‌ని ప‌డితే కౌగిలించుకోవ‌డం, ప‌నిలేక‌పోతే అస‌లు వాళ్లెవ‌రో కూడా తెలియ‌ద‌న్న‌ట్టుగా చూపు ప‌క్క‌కు మ‌ళ్లించి వెళ్లిపోతుంటార‌ని చెబుతుంటారు. చెవిరెడ్డి గురించి వైసీపీ నాయ‌కులు ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని క‌థ‌లుక‌థ‌లుగా చెబుతుంటారు.

వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌భుత్వ ప్ర‌ధాన స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తిరుప‌తికి వ‌చ్చారు. తిరుగు ప్ర‌యాణంలో విమానాశ్ర‌యంలో క‌లుస్తాన‌ని, అక్క‌డికి రావాల‌ని కొంద‌రు వైసీపీ నాయ‌కుల‌తో స‌జ్జ‌ల చెప్పారు. దీంతో స‌జ్జ‌ల కోసం వైసీపీ నాయ‌కులు తిరుప‌తి విమానాశ్ర‌యంలో ఎదురు చూస్తూ గ‌డిపారు. మ‌రోవైపు విమానం క‌దిలేందుకు స‌మ‌యం ముంచుకొస్తోంది. ప్లైట్ ఫైన‌ల్ అనౌన్స్‌మెంట్ స‌మ‌యానికి స‌జ్జ‌ల‌ను చెవిరెడ్డి విమానాశ్ర‌యానికి తీసుకొచ్చారు. అప్ప‌టికే ప్లైట్ టైమ్ కావ‌డంతో ఇక ఎవ‌రితోనూ మాట్లాడ్డానికి కూడా వీలు కాలేదు. ఈ సంద‌ర్భంగా వైసీపీ నాయ‌కులు చెప్పిన నీతి ఏమంటే.. ఎవ‌రైనా స‌జ్జ‌ల‌కు, త‌ద్వారా జ‌గ‌న్‌కు ద‌గ్గ‌ర అవుతార‌నే భ‌యంతో చెవిరెడ్డి చాలా ప్లాన్‌గా వ్య‌వ‌హ‌రించారని. తాను త‌ప్ప‌, జ‌గ‌న్‌తో పాటు ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు ఎవ‌రూ ద‌గ్గ‌ర కాకూడ‌ద‌నే ఎత్తుగ‌డ‌తో చెవిరెడ్డి వ్య‌వ‌హ‌రిస్తుంటార‌నేందుకు ఈ ఘ‌ట‌న‌ను వైసీపీ నేత‌లు ఉదాహ‌ర‌ణ‌గా చెబుతుంటారు.

ఇదే సంద‌ర్భంలో జ‌గ‌న్‌తో పాటు రాజ‌కీయ, ఇత‌ర రంగాల ప్ర‌ముఖుల‌కు ద‌గ్గ‌ర కావ‌డానికి చెవిరెడ్డి వాళ్ల మ‌న‌సెరిగి ప్ర‌వ‌ర్తిస్తుంటారు. వైసీపీ అధికారం కోల్పోయిన త‌ర్వాత వైసీపీలో చెవిరెడ్డి మ‌రింత కీల‌కంగా మారారు. త‌న ప్ర‌త్య‌ర్థి పులివ‌ర్తి నాని గెలుపు కోసం, త‌మ పెద్దాయ‌న పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అన్ని ర‌కాలుగా కృషి చేశార‌ని ఆరోపించిన త‌ర్వాత కూడా, వైసీపీలో చెవిరెడ్డి మ‌రింత కీల‌కంగా మారారంటే చిన్న క‌థ కాదు. దీన్ని బ‌ట్టి జ‌గ‌న్ వ‌ద్ద చెవిరెడ్డికి ఎంత ప‌ట్టు వుందో అర్థం చేసుకోవ‌చ్చు.

తాజాగా వైసీపీలో చోటు చేసుకున్న ప‌రిణామాల వెనుక చెవిరెడ్డి పాద‌ర‌సంలా చురుగ్గా వ్య‌వ‌హ‌రించార‌ని ఆ పార్టీ ముఖ్య నాయ‌కులు చెబుతున్నారు. ఇందులో భాగంగా వైసీపీలో “పెద్ద‌రెడ్ల‌”ను కూడా ప‌క్క‌కు నెట్టేసి, తాను అనుకున్న‌ది చెవిరెడ్డి సాధించుకోవ‌డం.. ఆ పార్టీలో చెవిరెడ్డి ప‌ర‌ప‌తిని తెలియ‌జేస్తోంది. ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌ను ఎలా కొట్టాలో చెవిరెడ్డికి బాగా తెలుసు. కిందిస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతున్న క్ర‌మంలో ఎప్పుడు, ఎక్క‌డ , ఎలా మెల‌గాలో చెవిరెడ్డికి తెలిసినంత‌గా మ‌రో నాయ‌కుడికి తెలియ‌దంటే అతిశ‌యోక్తి కాదు.

వైసీపీలో పెద్దిరెడ్డి కుటుంబం చాలా కీల‌క‌మ‌నే సంగ‌తి అంద‌రికీ తెలుసు. వారికి ఎదురు తిరిగి వైసీపీ బ‌తికి బ‌ట్ట క‌ట్టిన నాయ‌కులు లేర‌న్న‌ది వాస్త‌వం. అలాంటిది పెద్దిరెడ్డి కుటుంబాన్ని త‌న దారికి అడ్డం తొల‌గించుకోవ‌డం చెవిరెడ్డిలోని తెలివైన వ్యూహ‌క‌ర్త‌కు నిద‌ర్శ‌నం.

మొద‌ట పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల్ని జ‌గ‌న్ అప్ప‌గించారు. సీన్ క‌ట్ చేస్తే… పెద్దిరెడ్డిని జిల్లా అధ్య‌క్ష బాధ్య‌త‌ల నుంచి మార్పించారు. పెద్దాయ‌న అని గౌర‌విస్తూనే రామ‌చంద్రారెడ్డికి చిత్తూరుతో సంబంధం లేని స‌మ‌న్వ‌య‌క‌ర్త బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌డం , అలాగే ప్ర‌కాశం జిల్లా బాధ్య‌త‌ల‌ను పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డికి ఇవ్వ‌కుండా చెవిరెడ్డి చ‌క్రం తిప్పారు. ప్ర‌కాశం జిల్లాలో త‌న‌కు ఎదురే లేకుండా చెవిరెడ్డి చేసుకోగ‌లిగారు.

వైసీపీలో పెద్దిరెడ్డి కుటుంబాన్ని కాద‌ని ఏదైనా చేయ‌గ‌ల‌న‌నే స్థాయికి చెవిరెడ్డి ఎదిగారు. ఇదేమీ మామూలు విష‌యం కాదు. ఈ క్ర‌మంలో చెవిరెడ్డిపై సొంత పార్టీలోనే చాలా విమ‌ర్శ‌లున్నాయి. జ‌గ‌న్‌కు చెవిరెడ్డి గ‌న్‌మెన్‌లా వ్య‌వ‌హ‌రిస్తుంటార‌ని, అలాగే సంక్రాంతికి తాడేప‌ల్లిలో హిందూ సంప్ర‌దాయం ఉట్టిప‌డేలా ఏవేవో చేస్తుంటార‌ని, ఇవ‌న్నీ మ‌న‌వ‌ల్ల కాద‌ని వైసీపీ నాయకులు విమ‌ర్శిస్తుంటారు. రాజ‌కీయాల్లో కొన్ని కావాల‌నుకుంటే, కొన్ని వ‌దులుకోవాల్సి వుంటుంది. చెవిరెడ్డికి ల‌క్ష్య సాధ‌నే త‌ప్ప‌, మ‌రేదీ ప‌ట్టించుకోరు. అవ‌స‌ర‌మైతే ఎంతైనా ఖర్చు పెట్ట‌డానికి ఆయ‌న వెనుకాడ‌రు.

ఇదే ఆయ‌న అతిపెద్ద బ‌లం. పెద్దిరెడ్డి కుటుంబం వ‌ద్ద డ‌బ్బు ఉండ‌డం వ‌ల్లే క‌దా జ‌గ‌న్ విప‌రీత ప్రాధాన్యం ఇస్తున్నార‌ని, దాన్ని తాను సంపాదిస్తే, జ‌గ‌న్ త‌న వెంట ఎందుకు ఉండ‌ర‌నేది చెవిరెడ్డి ఆలోచ‌న‌. సూర్యుడి చుట్టూ భూమి ప‌రిభ్ర‌మిస్తుంటుంది. అలాగే డ‌బ్బు చుట్టూ జ‌గ‌న్ ప‌రిభ్ర‌మిస్తాడ‌ని ప‌సిగ‌ట్టిన వైసీపీ నాయ‌కులు… చాలా త్వ‌ర‌గా ఆయ‌న కోట‌రీలో అతి కీల‌క‌మైన నాయ‌కులుగా త‌యార‌వుతున్నారు. ఇంత‌కు మించిన ర‌హ‌స్యం మ‌రేదీ లేదు. ఇది తెలియ‌ని వాళ్లు, జ‌గ‌న్ త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వాపోతుంటారు. రాజ‌కీయాల్లో అధినాయ‌కుడి మ‌న‌సెరిగిన వాళ్లే ఏదైనా సాధిస్తారు.

ఇప్పుడు చెవిరెడ్డి వైసీపీలో నంబ‌ర్ -2 స్థాయికి ఎదిగారంటే, దానికి కార‌ణం ఆయ‌న‌కు తీసుకోవ‌డం, ఇవ్వ‌డం అనే విద్య‌ను ఔపోస‌న ప‌ట్ట‌డ‌మే. జ‌గ‌నే కాదు, చంద్ర‌బాబు, లోకేశ్ చుట్టూ ఎవ‌రున్నారో గ‌మ‌నిస్తే…. నీక్కావాల్సింది నా ద‌గ్గ‌ర వుంది అనే పాట గుర్తు తెచ్చుకుంటే, అన్ని స‌మాధానాలు దొరుకుతాయి. రాజ‌కీయ రంగంలో నీతి, నిజాయితీ, విలువలు వెతుక్కోవ‌డం అంత ప‌నికిమాలిన ప‌ని మ‌రొక‌లేదు. ఇవ‌న్నీ చెవిరెడ్డి త‌న అనుభ‌వాల ద్వారా తెలుసుకున్నారు. అందుకే చెవిరెడ్డి కోరుకునేవ‌న్నీ ఆయ‌న దాసోహం అవుతున్నాయి. చివ‌రికి జ‌గ‌న్‌తో స‌హా.

27 Replies to “వైసీపీలో నంబ‌ర్ 2”

  1. 2024 ఎన్నికల వరకు వైసీపీ లో 1 టూ 10 జగన్ రెడ్డే..

    ఎన్నికల తర్వాత 11 కూడా జగన్ రెడ్డే..

    11 తర్వాతే.. చెవి రెడ్డి అయినా.. ముక్కు రెడ్డి అయినా.. వాడి పిండాకూడు రెడ్డయినా …

    ఇంతకీ .. ఉన్నట్టుండి.. ఈ చెవి రెడ్డి గాడి భజన మొదలెట్టావేంటి…?

    వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జి పదవి ఇప్పిస్తానని ఏమైనా మాటిచ్చాడా..? నీ ఆశాత్రం నీది..

  2. Emitoyi, nijalu kakkutunnavu. Jagan revolves around money Ani nijalu ippudu chebitunnavu. Last 5 years vadi bhajanalo munigibtelavu ga. Most of AP people are having piece of mind from last 5 months. He is a monster.

      1. సామాన్యులు ఇష్టపడరు కాబట్టి రేప్! పై సారు లాంటి వాళ్ళకి రేప్ తప్పనప్పుడు హాయిగా అనుభవించమన్నాడు గురువుగారు అనే టైప్, అందుకే హాయిగా ఉన్నారు! అర్ధం చేసుకోరు

  3. ప్యాలస్ పులకేశి కి డబ్బు మాత్రమే టార్గెట్ అని ఎంత చక్కగా చెప్పావ్ గ్రేట్ ఆంద్ర.

    అలాగే క*ట్టు బా*నిస జీవితం ఎంత గొప్పదో కూడా చెప్పావ్.

    ప్యాలస్ పులకేశి దగ్గర కట్టు బా*నిస బతుకు కోసం ఎంత తహ తహ లాడుతున్నాయి అనేది కూడా బాగా చెప్పావ్.

    మీరు ..మీ బాని*స బతుకులు. యాక్..

  4. సజ్జలు కాళ్ళు పట్టుకుంటే పదవి రాలేదు అని ఇంకో బా*నిస యె*ర్ర చం*దనం పు*ష్పం గుబి*లి రె*డ్డి కా*ళ్ళు పట్టు*కోడం మొదలు పెట్టావా గ్రేట్ ఆంద్ర.

  5. జగన్ కి డబ్బు పిచ్చని ఓపెన్ గా రాసేసావు, మరి వాడేమో పేదలకు పెత్తందార్లు కు యుద్ధం అంటాడు. ఇక్కడ ‘కూజా’ లాంటి యూజర్లు వాడిని తెగ మోసేస్తున్నారు.

  6. నాధా,నాధా అంటూ కొంగున ముడేసుకున్న రకం అంటావు. సొంత సంపాదన తప్ప ఈ బిప్పం గాళ్ళ తో పార్టీ కి ఒరిగిందేమీ?

  7. ఇది సరే కాని చెల్లెలి కి ఇచ్చిన షేర్లు ఏవో తిరిగి ఇవ్వాలని NCLT ఏదో ఒక సంస్థ కి వెళ్లారట, మరి పాదాల మీద నడిచిన యాత్ర కి తగిన ప్రతిఫలం (కూలి) ఇచ్చారా లేదా?

  8. పోనీలే …. ఇప్పటికైనా ఆ సైకో గాడు డబ్బు పిచ్చోడని ఒప్పుకున్నావ్.

  9. షర్మిల కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఆమె పార్టీ పెట్టుకొని కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకొని పోటీచేయటం మంచిది విజయమ్మతో షర్మిల కలిసి రాష్ట్రము లో తిరిగితే ఆమె సామాజికవర్గం మొత్తం ఆమెకే మద్దతు ఇస్తుంది క్రిస్టియన్ వోటింగ్ కూడా మొత్తం తెచ్చుకొంటుంది జగనా శంకరగిరి మాన్యాలు పట్టడం ఖాయం మొత్తం నాయకులూ వైస్సార్ క్యాడర్ కూడా ఆమెకే మద్దతు ఇస్తారు

Comments are closed.