మాజీ ఎంపీకి వైసీపీ ఘనమైన పదవి

ఉత్తరాంధ్రాలో మేధావిగా ఉంటూ ఒకసారి ఎంపీగా పనిచేసిన నేతకు వైసీపీ ప్రభుత్వం కీలకమైన పదవిని అప్పగించి గౌరవించింది. ఆయన డాక్టర్ శంకరరావు. 1999-2004 మధ్యలో డాక్టర్ శంకరరావు పార్వతీపురం నుంచి ఎంపీగా పనిచేసి కాంగ్రెస్…

ఉత్తరాంధ్రాలో మేధావిగా ఉంటూ ఒకసారి ఎంపీగా పనిచేసిన నేతకు వైసీపీ ప్రభుత్వం కీలకమైన పదవిని అప్పగించి గౌరవించింది. ఆయన డాక్టర్ శంకరరావు. 1999-2004 మధ్యలో డాక్టర్ శంకరరావు పార్వతీపురం నుంచి ఎంపీగా పనిచేసి కాంగ్రెస్ హయాంలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఏడాది క్రితం వరకూ కాంగ్రెస్ లో ఉండేవారు. 2019 ఎన్నికల్లో పాలకొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీలో ఏడాది క్రితం చేరిన శంకరరావు మంచి గుర్తింపు లభించినట్లు అయింది.

రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఆయనను నియమిస్తూ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల పాటు ఈ నామినేటెడ్ పదవిలో ఆయన కొనసాగుతారు. క్యాబినెట్ ర్యాంక్ కలిగిన ఈ పదవిని శంకరరావుకు ఇవ్వడం ద్వారా పార్వతీపురం మన్యం జిల్లాలో వైసీపీకి కొత్త బలాన్ని ఆ పార్టీ జత కూర్చుకుంది అని అంటున్నారు.

రానున్న ఎన్నికల్లో పార్టీని మరింత పటిష్టం చేసుకునే క్రయంలో కీలక నేతలకు అవకాశాలు ఇస్తున్నారు అని తెలుస్తోంది. శంకరరావు ప్రస్తుతం నెల్లిమర్ల మిమ్స్ కళాశాల ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఆయన సేవలు పార్టీకి ఎంతగానో ఉపయోగపడతాయని వైసీపీ నేతలు అంటున్నారు. 

ఇప్పటికే గిరిజన నియోజకవర్గాలలో నూరు శాతం సీట్లు దక్కించుకున్న వైసీపీ 2024 ఎన్నికలకు కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది.