జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పు చూపిస్తూ నన్ను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతా అంటూ ఊగిపోయి ప్రసారం చేసిన వైసీపీ మంత్రులు ఎక్కడ తగ్గడం లేదు. గతంలో కంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండా ప్యాకేజీ స్టార్ అనే పిలుస్తున్నారు. దానికి తొడు చంద్రబాబు నాయుడుతో కలిసి సమావేశం అయిన తర్వాత ఆ పేరు ప్రజల్లోకి కూడా వెళ్లిపోయింది.
ఇవాళ మంత్రి సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ పవన్ కు దమ్ముంటే, జనసేన టీడీపీ అనుబంధ విభాగం కాకుంటే జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో 175 చోట్ల పోటీ చేయాలని, అప్పుడు అందరూ ప్యాకేజీ తీసుకోలేదని నమ్ముతారని చెప్పారు. విడిపోయిన బంధం మళ్లీ కలవడానికి ఎంత ప్యాకేజీ ముట్టిందో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు.
పవన్ పెళ్ళిళ్ళ సిద్ధాంతం పరిపాటిగా మారిందని, మొదట ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోని, తర్వాత నచ్చకపోతే ప్యాకేజీలు ఇచ్చి వదిలించుకున్నారని అలా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నట్లు కనపిస్తోందన్నారు. పవన్ కల్యాణ్ మాటల్లో.. మాకు అర్థమైంది ఏమిటంటే.. పెళ్ళిళ్ళు చేసుకోవడం.. మహిళల్ని వాడుకోవడం.. ఆ తర్వాత చంద్రబాబు దగ్గర తీసుకున్న ప్యాకేజీల్లో కొద్దోగొప్పో ఇచ్చి.. వారికి విడాకులు ఇచ్చి వదిలించుకోవడం పరిపాటిగా మారిందని విమర్శించారు.