లోకేశ్ భార్య నారా బ్రాహ్మణిపై ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి తన ఫేస్బుక్లో అభ్యంతరకర పోస్టు పెట్టడం చర్చనీయాంశమైంది. పవన్‌కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ నోటీసు ఇచ్చిన నేపథ్యంలో, బ్రాహ్మణిపై ఏకంగా మహిళా కమిషన్ సభ్యురాలే సభ్య సమాజం సిగ్గుపడేలా పోస్టు పెట్టడం ఏంటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జనసేనాని పవన్‌కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నిజానికి వాసిరెడ్డి పద్మ రాజకీయ నేపథ్యం వామపక్ష భావజాలంతో ముడిపడి వుంది. విధానాలు, సిద్ధాంతాల ప్రాతిపదికన ఆమె రాజకీయ ప్రత్యర్థులతో పోరాడుతుంటారు. రాజకీయంగా వాసిరెడ్డితో పద్మతో విభేదించే వాళ్లు ఉండొచ్చేమో కానీ, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ ఆమెను గౌరవిస్తారు.
అయితే ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రాజ్యాంగ పదవిలో వుంటూ, వైసీపీ కొమ్ము కాస్తున్నారనే విమర్శలను ఆమె ఎదుర్కొంటున్నారు. తాజాగా పవన్‌కల్యాణ్‌కు నోటీసు ఇచ్చిన పద్మ, ఆయన మూడు పెళ్లిళ్ల గురించి విమర్శించే వాళ్లకు ఎందుకు ఇవ్వరనే ప్రశ్న జనసేన నుంచి వినిపిస్తోంది.
మరీ ముఖ్యంగా మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి తన ఫేస్బుక్లో మూడు రోజుల క్రితం పెట్టిన పోస్టుపై ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలను కించపరిచే హక్కు మహిళా కమిషన్ సభ్యురాలికి ఉందా? అంటూ నిలదీస్తున్నారు. మహిళల హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యతాయు తమైన పదవిలో వుంటూ, ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకుల కుటుంబాల్లోని మహిళలపై నీచాతినీచమైన పోస్టు పెట్టిన గజ్జల లక్ష్మిని ఏం చేస్తారో చెప్పాలని వాసిరెడ్డి పద్మను నిలదీస్తున్నారు. వివాదానికి కారణమైన ఆ పోస్టు ఏంటో చూద్దాం.
“ఇంద్రబాబు నాయుడు పరామర్శ పరంపరలో భాగంగా ఫన్ కళ్యాణ్ పైన అత్యాచారం చేశారా? ఎవరైనా మరి ఇంద్రబాబు నాయుడు ఎందుకు పరామర్శకు వెళ్ళాడు? గతంలో రాహుల్ గాంధీ పార్క్ హయత్‌లో ఉంటే కోడల్ని ఒంటరిగా పంపాడు రాజకీయ అవసరాలకి. ఇప్పుడు ఫన్ కళ్యాణ్‌ను ఒంటరిగా కలిశాడు. మొత్తానికి కలవడం అన్నది కామనే. ఎట్టకేలకు దత్తపుత్రుడిని చేరుకున్న దత్తతండ్రి !అన్నమాట సార్థకం చేసుకున్నాడు”
ఇంద్రబాబునాయుడని ఏ ఉద్దేశంతో అన్నారో చెప్పుకోడానికే సంస్కారం అడ్డొస్తోందని, అలాగే ఫన్కళ్యాణ్పై అత్యాచారం చేశారా?…ఇలాంటి వ్యాఖ్యలు ఓ మహిళా కమిషన్ సభ్యురాలు చేశారంటే, ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అలాగే రాహుల్‌గాంధీ దగ్గరికి తన కోడల్ని చంద్రబాబు ఒంటరిగా పంపారని ఫేస్బుక్లో ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు పోస్టు పెట్టిన సంగతి వాసిరెడ్డి పద్మకు తెలియదా? అని నెటిజన్లు నిలదీస్తున్నారు.
ఇది మహిళల్ని కించపరచడం కాదా? ఇలాంటి వాళ్లను పక్కనే పెట్టుకుని వాసిరెడ్డి ఏం మాట్లాడ్తారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వాసిరెడ్డి పద్మకు తన సభ్యురాలు ఏం చేస్తున్నారో తెలియనట్టుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన కమిషన్ సభ్యురాలి పోస్టింగ్‌పై దుమారం రేగుతున్న నేపథ్యంలో వాసిరెడ్డి పద్మ నిర్ణయంపై ఆసక్తి నెలకుంది.