ఎలాగైనా బీజేపీతో పొత్తు పెట్టుకోని అధికారం దక్కించుకోవాలని శతవిధాలుగా ప్రయత్నిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నాలను ఆదిలోనే తుంచేస్తున్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరో ఆయుధాన్ని ఇచ్చాడు. నిన్న అచ్చెన్నాయుడు వైసీపీ-బీజేపీ పార్టీలపై చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు సోము వీర్రాజు.
సోము వీర్రాజు ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, వైసీపీ పార్టీలు కలిసి ఉన్నాయని చెప్పడానికి ఆయన ఎవరని ప్రశ్నించారు. బీజేపీతో టీడీపీ కలుస్తుందని ఎవరైనా అంటే అచ్చెన్న ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. త్వరలో వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి కూడా పెద్దఎత్తున నేతలు.. బీజేపీలో చేరుతారంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ.. బీజేపీతో పొత్తు కోసం పాకులాడటం నిజం కదా అంటూ ఫైర్ అయ్యారు.
కాగా నిన్న అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. బీజేపీకి, వైసీపీకి మధ్య సంబంధం లేదని ప్రజలు అనుకోవాలని.. అచ్చెన్నాయుడో.. సునీల్ ధియోధరో.. వేరేవరో అనుకుంటే ఫలితం లేదని.. మనం చెప్పే మాటలను ప్రజలు నమ్మాలని .. వైసీపీ-బీజేపీ మధ్య సంబంధం ఉందో లేదో ప్రజలకు తెలుసంటూ హాట్ కామెంట్స్ చేశారు.
బీజేపీతో అధికారిక పొత్తులో.. టీడీపీతో అనాధికారిక పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ-బీజేపీ కలపడానికి ప్రయత్నిస్తుంటే కొంత మంది టీడీపీ, బీజేపీ నేతలు మాటల దాడులకు దిగుతున్నారు.