కుగ్రామంలో జగన్ మార్క్ వండర్ !

వైఎస్ జగన్ అంతే. మాటలతో చెప్పరు. ఆశ అంతకంటే పెట్టరు. ఆయన పని చెబుతుంది. ఆయన కూడా అదే మాట్లాడుతుందని ఊరుకుంటారు. ఎవరైనా ఊహించారా ఒక కుగ్రామంలో ఏడు నక్షత్రాల హొటల్ వస్తుందని, ఎవరైనా…

వైఎస్ జగన్ అంతే. మాటలతో చెప్పరు. ఆశ అంతకంటే పెట్టరు. ఆయన పని చెబుతుంది. ఆయన కూడా అదే మాట్లాడుతుందని ఊరుకుంటారు. ఎవరైనా ఊహించారా ఒక కుగ్రామంలో ఏడు నక్షత్రాల హొటల్ వస్తుందని, ఎవరైనా కలగన్నారా అద్భుతమైన రిసోర్ట్స్ ఒక పల్లె ప్రాంతంలో ఆవిర్భవిస్తుందని

అది జగన్ చేసి చూపిస్తున్నారు. దటీజ్ జగన్ అనిపించుకుంటున్నారు. విశాఖ జిల్లా భీమిలీ నియోజకవర్గం అన్నవరం గ్రామంలో ఏడు నక్షత్రాల హొటల్ కం రిసార్ట్స్ కి జగన్ వర్చువల్ గా ఈ రోజు శంకుస్థాపన చేశారు.

దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ ని ఒబెరాయ్ హొటల్ యాజమాన్యం టేకప్ చేస్తోంది. దేశంలోనే పేరెన్నిక కన్న గొప్ప సంస్థ అది. ఆతిధ్య రంగంలో తనకు తిరుగులేదనిపించుకున్న ఒబెరాయ్ యాజమాన్యం ఏపీ వైపు చూసిందంటే అది జగన్ సర్కార్ గొప్పదనమే.

విపక్షాలు ఈ విషయంలో అంగీకరించినా లేకపోయినా కూడా ఇదే నిజం. ఈ ఏడాది మార్చిలో విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో ఏపీలో మూడు ప్రఖ్యాత హొటెల్ కం రిసార్ట్స్ నిర్మాణానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఒబెరాయ్ ఏపీ సర్కార్ తో ఒప్పందం కుదుర్చుకుంది.

దాని ఫలితమే ఇపుడు ఏపీలో ఏడు నక్షత్రాల హొటల్స్ మూడు రాబోతున్నాయి. ఏపీకి పెట్టుబడులు ఏవీ అని ప్రశ్నించేవారికి విశాఖ పెట్టుబడుల సదస్సు కాగితాలకే పరిమితం అయింది అని విమర్శించేవారికి ఈ ప్రారంభోత్సవాలు ఒక జవాబుగా ఉంటాయని వైసీపీ నేతలు అంటున్నారు. విశాఖలో అభివృద్ధి మాదే అని అంటున్న టీడీపీకి కూడా ఇది సరైన రియాక్షన్ అని వైసీపీ నేతలు అంటున్నారు. దటీజ్ జగన్ అనిపించారుగా అని అంతా చెప్పాల్సిందే.