బీసీ కార్డు…తమ్ముళ్ళ దూకుడు…?

వైసీపీ ఏపీలో బీసీ కార్డు తీసింది. ఏకంగా నలుగురు రాజ్యసభ ఎంపీలకు గానూ ఇద్దరిని ఎంపిక చేసి పెద్దల సభకు పంపించింది. ఈ నేపధ్యంలో టీడీపీకి చెందిన బీసీ నేతలు ఒకరొకరుగా మీడిగా ముందుకు వచ్చి…

వైసీపీ ఏపీలో బీసీ కార్డు తీసింది. ఏకంగా నలుగురు రాజ్యసభ ఎంపీలకు గానూ ఇద్దరిని ఎంపిక చేసి పెద్దల సభకు పంపించింది. ఈ నేపధ్యంలో టీడీపీకి చెందిన బీసీ నేతలు ఒకరొకరుగా మీడిగా ముందుకు వచ్చి బీసీ పార్టీ అంటే మాదే, బీసీ నేతలమంటే మేమే అని గట్టిగానే చెబుతున్నారు.

ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు అయితే ఎన్ని జన్మలెత్తినా వైసీపీ నేతలు టీడీపీని బీసీలను వేరు చేయలేరని భారీ ప్రకటనే ఇచ్చేశారు. అయినా బీసీలు అంటే గుర్తుకు వచ్చే పార్టీ మాదీ అని కూడా అచ్చెన్న చెప్పేసుకున్నారు. 

మరో వైపు చూస్తే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అయితే బీసీల పట్ల వైసీపీకి అసలు ప్రేమ లేదని దుయ్యబెడుతున్నారు. తెలంగాణాకు చెందిన వారికి ఎంపీలు ఇవ్వడమేంటని అంటున్నారు. బీసీలకు టీడీపీయే పెద్ద దిక్కుగా ఉంటూ వస్తోందని అంటున్నారు.

ఇక ఏపీ టీడీపీ మాజీ ప్రెసిడెంట్ కళా వెంకటరావు అయితే వైసీపీ సామాజిక న్యాయం చేసింది ఏముంది అంటూ లైట్ తీసుకుంటున్నారు. నలుగురు మంత్రులు బస్సులేసుకుని తిరిగితే ఏపీలో సామాజికన్యాయం జరిగినట్లా అని ఆయన నిలదీస్తున్నారు. ఈ రకమైన స్టేట్మెంట్స్ వరసబెట్టి వస్తున్నాయి అంటే ఒక్కటే విషయం ఉంది అంటున్నారు.

వైసీపీ బీసీ కార్డు బయటకు తీసింది. దాంతో బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీలో ఎక్కడో కలవరం రేగుతోంది అంటున్నారు. అందుకే ఇలా మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామక్రిష్ణుడితో మొదలుపెట్టి నియోజకవర్గం స్థాయి టీడీపీ నేత దాకా పెద్ద బీసీలం మేమే అని అంటున్నారు. 

మరి బీసీలకు అసలైన న్యాయం ఎవరు చేశారో ప్రజలు చెబుతారు కానీ ఇవన్నీ రాజకీయ విమర్శలే  అని వైసీపీ నేతలు కొట్టి పారేస్తున్నారు. మొత్తానికి టీడీపీ బీసీ గర్జన వెనక అదన్న మాట మ్యాటర్.