బొత్స ఫెయిల్…విపక్షాలు మార్కుల షీట్ ..?

అటూ ఇటూ తిరిగి అంతా కలసి బొత్స సత్యనారాయణ మీద పడ్డారు. ఆయన విద్యా శాఖ మంత్రిగా ఇలా బాధ్యతలు స్వీకరించారో లేదో ఆలా పరీక్షలు వచ్చాయి. ఒక విధంగా బొత్సకు ఇపుడు ఇవి…

అటూ ఇటూ తిరిగి అంతా కలసి బొత్స సత్యనారాయణ మీద పడ్డారు. ఆయన విద్యా శాఖ మంత్రిగా ఇలా బాధ్యతలు స్వీకరించారో లేదో ఆలా పరీక్షలు వచ్చాయి. ఒక విధంగా బొత్సకు ఇపుడు ఇవి అసలైన పరీక్షలుగా ఉన్నాయి. ఎలిమెంటరీతో మొదలై టెన్త్ ఇంటర్ ఇలా సాగబోతున్నాయి.

ఇక చూస్తే పరీక్ష పేపర్ల లీకుల పేరిట ప్రతీ రోజూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో మంత్రి బొత్స మీద టీడీపీ నేతలు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. విద్యా శాఖ మంత్రిగా బొత్స ఫెయిల్ అయ్యారని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు అంటున్నారు. టెన్త్ ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీ ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మేన‌న్నారు.

పరీక్ష పేపర్లు వరసబెట్టి లీక్ అవుతూంటే మంత్రి ఏం చేస్తున్నారు అని ఆయన నిలదీశారు. ఈ విషయంలో బొత్స ఏమైనా చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీకి నైతిక బాధ్య‌త వ‌హిస్తూ బొత్స స‌త్య‌నారాయ‌ణ త‌క్ష‌ణ‌మే త‌న మంత్రి ప‌దవికి రాజీనామా చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. 

అంతేకాకుండా ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌రిపించాలని అచ్చెన్నాయుడు కోరారు. అదే విధంగా మాజీ మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలు కూడా బొత్స మీద దాడి చేస్తున్నారు.

సర్కార్ ఈ విషయంలో బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని, లక్షలాది విద్యార్ధుల ఆశలను నిలబెట్టాలని కోరుతున్నారు. మొత్తానికి వైసీపీ సర్కార్ ఏలుబడిలో తొలిసారిగా జరుగుతున్న పబ్లిక్ పరీక్షలు ఇవి. మంత్రి బొత్స ఈ విషయంలో ఫెయిల్ అని విపక్షాలు మార్కుల షీట్ ఇచ్చేశాయి. ఈ విమర్శలకు ఆయనే తగిన విధంగా జవాబు ఇవ్వాలి మరి.