ఓడిన మూడేళ్ళ తరువాత కొత్త సవాల్… ?

శ్రీకాకుళం జిల్లాలోని పలాస అంటే జీడిపప్పుకు ప్రసిద్ధి. నిజంగా కనుక అభివృద్ధి చేస్తే ఈపాటికి ఇక్కడ అతి పెద్ద వాణిజ్య కేంద్రం కనిపించేంది. నాలుగు దశాబ్దాల హిస్టరీ ఉన్న టీడీపీలో మాజీ మంత్రి గౌతు…

శ్రీకాకుళం జిల్లాలోని పలాస అంటే జీడిపప్పుకు ప్రసిద్ధి. నిజంగా కనుక అభివృద్ధి చేస్తే ఈపాటికి ఇక్కడ అతి పెద్ద వాణిజ్య కేంద్రం కనిపించేంది. నాలుగు దశాబ్దాల హిస్టరీ ఉన్న టీడీపీలో మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీది సగానికి పైగా రాజకీయ వాటా.

అలాంటి ఆయన తండ్రి గౌతు లచ్చన్న వారసుడిగా రాజకీయంగా బాగానే వెలిగారు. ఎన్నో కీలకమైన పదవులు అందుకున్నారు. ఇక అసెంబ్లీ విభజన తరువాత పలాసకు వచ్చి 2014 ఉంచి 2019 మధ్య ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019లో జనాలు ఆయన కుమార్తె శిరీషను ఓడించారు.

మూడేళ్ళు గమ్మున ఉన్న తరువాత ఇపుడు తమ అయిదేళ్ళ ఏలుబడిలో అభివృద్ధి ఎంతో చేశామని శివాజీ అంటున్నారు. మీకు దమ్ముంటే మూడేళ్ళ అభివృద్ధి మీద శ్వేతపత్రం విడుదల చేస్తారా అని వైసీపీ నేతలకు సవాల్ చేస్తున్నారు. తాము పలాసకు ఎంతో చేశామని కూడా మాజీ మంత్రి గారు అంటున్నారు.

పలాసకు అంతలా అభివృద్ధి ఫలాలు తెస్తే 2019 ఎన్నికల్లో జనాలు టీడీపీని ఎందుకు ఓడగొట్టారో మరి అని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అయినా ఓడిన ఇన్నేళ్ళకా అభివృద్ధి గుర్తుకు వచ్చిందని ఎద్దేవా చేస్తున్నారు. 

మంత్రి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే సీదరి అప్పలరాజు అయితే మూడేళ్ళలో మేము చేసిన అభివృద్ధిని చెప్పడానికి శ్వేతపత్రం కాదు ఏకంగా బహిరంగ చర్చకు రెడీ అంటున్నారు. టైమ్ డేట్ మీరు ఫిక్స్ చేసినా ఓకే అని ఓపేన్ చాలెంజ్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తూంటే పలాసకు మరోసారి చినబాబు లోకేష్ వచ్చేలాగా ఆయన్ని టీడీపీ వారు రప్పించేలా ఉందని అంటున్నారు.