టీడీపీకి ఉక్కు వణుకు

తెలుగుదేశం తమ్ముళ్ళను విశాఖ ఉక్కు వణికిస్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధం కావాలని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. లేకపోతే ఎన్నికల ముందు విశాఖ ఉక్కుని పరిరక్షిస్తామని ఇచ్చిన హామీ…

తెలుగుదేశం తమ్ముళ్ళను విశాఖ ఉక్కు వణికిస్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధం కావాలని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. లేకపోతే ఎన్నికల ముందు విశాఖ ఉక్కుని పరిరక్షిస్తామని ఇచ్చిన హామీ మీద కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే టీడీపీ ఎంపీ ఎమ్మెల్యేల రాజీనామాకు డిమాండ్ చేసి రాజకీయ వేడిని రగిల్చారు. దాంతో కార్మికులు దీక్ష చేస్తున్న శిబిరానికి గాజువాక ఎమ్మెల్యే ఏపీ టీడీపీ అధ్యక్షుడు అయిన పల్లా శ్రీనివాసరావు వెళ్లి సంఘీభావం ప్రకటించారు.

విశాఖ ఉక్కుని రక్షించుకోకపోతే తాను ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేస్తాను అని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కుని కాపాడేందుకు తాము తుదివరకూ ప్రయత్నం చేస్తామని అన్నారు. అలాగే టీడీపీ ఎంపీ శ్రీభరత్ కూడా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డు పడతామని అన్నరు కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంతవాకూ కార్మికల పక్షానే ఉండి పోరాడుతామని చెప్పారు.

అయితే ఉక్కు కార్మిక లోకం ఈ మాటలను పక్కన పెడితోంది. విశాఖ ఉక్కు మూసివేతకు కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోందని అందువల్ల చంద్రబాబు నాయకత్వంలో వేంటనే అఖిల పక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకుని వెళ్ళి ఉక్కు మీద బలమైన హామీని పొందాలని డిమాండ్ చేస్తున్నారు.

మాటలతో సమయం లేదు అని అంటున్నారు. తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటేనే తప్ప ఉక్కు బతికి బట్టకట్టదని వారు స్పష్టం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా విశాఖ ఉక్కుకి ముడి సరకు నిలుపుదల చేయడం ద్వారా ఇబ్బంది పెడుతున్నారని ఇది ప్లాంట్ మూతకే దారి తీస్తుందని వారు అంటున్నారు.

ఇపుడు విశాఖ ఉక్కు సమస్య టీడీపీ గొంతుక మీద కూర్చునట్లు అయింది. ముందు చూస్తే నుయ్యి వెనకన గొయ్యి అన్నట్లుగా ఉంది. కేంద్రం అయితే ప్రైవేటీకరణకు డిసైడ్ అయిపోయింది అని అంటున్నారు. ఈ విషయంలో చంద్రబాబు కేంద్రానికి నచ్చచెప్పినట్లు అయితేనే ఒడ్డున పడుతుంది. స్టీల్ ప్లాంట్ విషయంలో రివర్స్ లో ఏమైనా జరిగితే అది టీడీపీకే అతి పెద్ద సమస్య అవుతుందని అంటున్నారు.

18 Replies to “టీడీపీకి ఉక్కు వణుకు”

    1. sar sarle enno anukuntam anni avuta ya emiti . shekka l/k edo peekutadu ani 1/5/1 esthe …

      mod… gu… ap ni … anduke 23 ani edipinche number kante sagam kuda rakunda lan/ga 1/1 echaru lan/ga jagan ki

      avunu ra l/k shekka gadu naku 1/6 mp lu vunnaru annadu ga mari nee gu tintunada ??

    2. mod… gu… ap ni … anduke 2/3 ani edipinche number kante sagam kuda rakunda lan/ga 1/1 echaru lan/ga jagan ki

      avunu ra l/k shekka gadu naku 1/6 mp lu vunnaru annadu ga mari nee gu tintunada ??

Comments are closed.