బెట్టింగ్ అంటేనే జూదం! మీ ఆర్థిక వనరులను సర్వనాశనం చేసుకోవడం! ఆశల మీద, పట్టుదల మీద అర్థంలేని ప్రయాణం చేస్తూ జీవితాన్ని నాశనం చేసుకోవడమే! బెట్టింగ్ పూర్తిగా పరిహరించాల్సిన విషయం. కానీ ప్రస్తుతం ఎన్నికల ఫలితాల మీద సాగుతున్న బెట్టింగ్ వ్యవహారాలలో ఒకటి మాత్రం తెలుగుదేశం పార్టీ భక్తులకు జాక్ పాట్ బెట్టింగ్ అవకాశం లాగా కనిపిస్తోంది.
బెట్టింగులు సాధారణంగా రకరకాల హెడ్స్ మీద నడుస్తుంటాయి. ఉదాహరణకు- ఏపీలో విజయం సాధించేది ఎవరు? వైయస్సార్ కాంగ్రెస్ లేదా తెలుగుదేశం పార్టీ కూటమికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? జగన్ చెప్పినట్లుగా వైసీపీకి 151 కంటే ఎక్కువ వస్తాయా లేదా? ఇలాంటి పెద్ద అంశాలు మాత్రమే కాదు.
కడప ఎంపీ స్థానంలో షర్మిలకు ఎన్ని ఓట్లు దక్కుతాయి? ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణ రాజు గెలుస్తాడా లేదా? భీమవరంలో ఎవరు నెగ్గుతారు? పవన్ కళ్యాణ్ కు దక్కబోయే మెజారిటీ ఎంత? ఇలాంటి సెలబ్రిటీల చుట్టూ ముడిపడిన అనేక హెడ్స్ మీద కూడా బెట్టింగులు సాగుతూ ఉంటాయి.
సాధారణంగా బెట్టింగుల్లో ఒకటికి ఒకటి- ఒకటికి రెండు- చెప్పే ఆఫర్లు ఊరిస్తూ ఉంటాయి. అయితే తెలుగుదేశం భక్తులకు ఒక మహత్తర అవకాశం లాగా ‘ఒకటికి ఐదు రెట్లు ముట్టచెప్పే బెట్టింగ్ ఛాన్స్ సవాలు విసురుతోంది. మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ విజయావకాశాలకు సంబంధించిన బెట్టింగ్ అది! లోకేష్ ఖచ్చితంగా ఓడిపోతారని ఆయన గెలిస్తే ఒకటికి ఐదు చెల్లిస్తామని పలువురు బెట్టింగ్ కాస్తున్నారు. లోకేష్ విజయం మీద నమ్మకం ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఈ బెట్టింగ్ అవకాశాన్ని వినియోగించుకుంటే జాక్ పాట్ తగులుతుంది.
కానీ లోకేష్ మీద నమ్మకంతో బెట్టింగ్ కాయడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు అని తెలుస్తోంది! చంద్రబాబు నాయుడు పాపం భావి ముఖ్యమంత్రిగా పప్పు లోకేష్ ను ప్రొజెక్ట్ చేయాలని అనుకుంటూ ఉండగా, కనీసం ఆయన మంగళగిరిలో గెలుస్తాడనే నమ్మకం కూడా పార్టీలో లేదని ప్రజలు నవ్వుకుంటున్నారు.