మోడీ, ప‌వ‌న్ భేటీ.. ప‌చ్చ హ‌డావుడి అంతాఇంతా కాదు!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని క‌ల‌వ‌బోతున్నారంటూ తెలుగుదేశం, దాని అనుకూల మీడియాలో ఒక‌టే హ‌డావుడి! ఇక వైఎస్సార్సీపీ ప‌ని అయిపోయింద‌ని, జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నార‌ని తెగ వార్త‌లు వండివారుస్తున్నాయి ఈ వ‌ర్గాలు!…

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని క‌ల‌వ‌బోతున్నారంటూ తెలుగుదేశం, దాని అనుకూల మీడియాలో ఒక‌టే హ‌డావుడి! ఇక వైఎస్సార్సీపీ ప‌ని అయిపోయింద‌ని, జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నార‌ని తెగ వార్త‌లు వండివారుస్తున్నాయి ఈ వ‌ర్గాలు! రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన వ్య‌క్తి ప్ర‌ధానిని క‌లిస్తే జ‌గ‌న్ కు వ‌చ్చిన న‌ష్టం ఏమిటో జాతి మీడియాకే తెలియాలి. ముఖ్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో నిల‌బ‌డానికి స‌రైన నియోజ‌క‌వ‌ర్గం కూడా లేని నేత‌ను చూసి జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నారంటూంటే ఎలా న‌వ్వాలో వారికే తెలియాలి!

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న రాజ‌కీయ పార్టీ ఆవిర్భావం ద‌గ్గ‌ర నుంచి సింగిల్ గా ఎన్నిక‌ల‌కు వెళుతున్నారు త‌ప్ప చంద్ర‌బాబు లాగా అయితే పొత్తు, లేక‌పోతే లోపాయికారి ఒప్పందం చేసుకొని ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం లేదు! 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన క‌లిసి వైసీపీ కంటే దాదాపు 1.5 శాతం ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నాయి. కానీ వారు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్క‌టే అప్ప‌ట్లో న‌రేంద్ర మోడీ పై అభిమానం వారికి క‌లిసివ‌చ్చింది. ఇప్పుడు ప‌రిస్ధితులు మారాయి. సీఎంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పరిపాలిస్తున్నారు. రాష్ట్రంలో పేద వారి ఇంటికే డ‌బ్బులు వెళ్తున్నాయి. జ‌గ‌న్ అంటే ఏంటో పేద ప్ర‌జ‌ల‌కు బాగా అర్థం అయింది.

జ‌గ‌న్ ఎప్పుడు ప‌క్క పార్టీ వారిపై అధార‌ప‌డ‌లేదు. ఇప్పుడు కూడా ప్ర‌ధాని విశాఖ ప‌ర్య‌ట‌న‌లో కూడా ప్రొటో కాల్ ప్ర‌కారం మీటింగ్స్ లో పాల్గొనాలే త‌ప్ప మోడీ అవ‌స‌రం రాజ‌కీయంగా జ‌గ‌న్ కు లేదు. కేంద్రం నుంచి అర‌కొర డ‌బ్బులు రాష్ట్రానికి వ‌స్తున్నా వారితో మంచిగా వెళ్లి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నారే త‌ప్ప పొత్తుల‌తో గెలవాల‌ని కాదు కదా. పొత్తుల కోసం వెంప‌ర్లాడుతూ బీజేపీ ద‌గ్గ‌రకు త‌న స‌న్నిహితుడుని పంపి పొత్తు కుదుర్చుకొవాల‌ని చూస్తున్నారంటే చంద్ర‌బాబుకు త‌న‌పై ఎంత న‌మ్మ‌కం ఉందో అర్థం అవుతూనే ఉంది.

రేపు ప‌వ‌న్ క‌ల్యాణ్ మీడియా ముందుకు వ‌చ్చి జ‌న‌సేన‌- బీజేపీ మాత్ర‌మే పొత్తు అంటే ప‌వ‌న్ పై ఇదే ఎల్లో మీడియా ఇలాంటి వార్త‌ల‌నే రాస్తుందా? అనేది అర్థం చేసుకోలేనంత క‌ష్ట‌మైన అంశం కాదు!