నిన్న మాజీ మంత్రి.. నేడు మాజీ ఎంపీ

విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మీద నాన్ బెయిల్ బుల్ కేసు నమోదు అయింది. ఆయన ఎంపీగా ఉన్న టైం లో ఎండాడ వద్ద భూములను లాగేసుకున్నారంటూ పోలీస్ స్టేషన్ లో కొందరు…

విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మీద నాన్ బెయిల్ బుల్ కేసు నమోదు అయింది. ఆయన ఎంపీగా ఉన్న టైం లో ఎండాడ వద్ద భూములను లాగేసుకున్నారంటూ పోలీస్ స్టేషన్ లో కొందరు ఇచ్చిన ఫిర్యాదు నేపధ్యంలో మాజీ ఎంపీ మీద 10 నాన్ బెయిల్ బుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఎండాడ వద్ద హయగ్రీవ కన్స్ ట్రక్షన్ అధినేత తన భూముల విషయంలో ఒప్పందాలు అని చెప్పి ఖాళీ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నారు అని ఫిర్యాదు చేశారు. తన విలువైన భూములను కాజేసే ప్రయత్నం చేశారు అని ఆయన ఆరోపించారు.

హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ సంస్థకు కేటాయించిన 12.50 ఎకరాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని జనసేన కార్పోరేటర్ ఒకరు జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. వృద్ధాశ్రమం అన్న దానం  కార్యక్రమాల కోసం ప్రభుత్వం ఇచ్చిన భూమిని వేరే విధంగా వినియోగిస్తున్నారు అని నిబంధనలకు ఇది విరుద్ధం అని ఆయన పేర్కొన్నారు

ఇలా మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మీద వరసగా ఫిర్యాదులు వచ్చాయి. పోలీసు కేసులు నమోదు అయ్యాయి. అయితే దీని మీద హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన మాజీ ఎంపీ ఈ విషయంలో ఉపశమనం కోసం చూస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఈ విధంగా కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. 

మాజీ మంత్రి భవనాలను కూల్చేయాలని అలాగే బిల్డర్ గా ఉన్న మాజీ ఎంపీ భూములను తీసేసుకోవాలని కేసులు పెడుతున్నారని వారు అంటున్నారు. అక్రమాలు అని తెలిసిన తరువాతనే తాము ఫిర్యాదు చేస్తున్నామని ఫిర్యాదుదారులు అంటున్నారు. వీటి సంగతి పక్కన పెడితే నిన్న మాజీ మంత్రి నేడు మాజీ ఎంపీ రేపు ఎవరు అన్నది వైసీపీలో చర్చకు తెర లేస్తోంది.