మొదటి రోజు నుంచి ఇదే పాట కదా తమ్ముళ్ళూ

వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి టీడీపీ పాడే పాట ఒక్కటే కదా. అందులో కొత్త ఏముంది మరి. జగన్ ఇలా సీఎం సీటు ఎక్కారో లేదో నాటి నుంచి ఏపీలో ఎన్నికలు…

వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి టీడీపీ పాడే పాట ఒక్కటే కదా. అందులో కొత్త ఏముంది మరి. జగన్ ఇలా సీఎం సీటు ఎక్కారో లేదో నాటి నుంచి ఏపీలో ఎన్నికలు పెట్టండి మేము అధికారంలోకి వచ్చేస్తామని టీడీపీ ఒక్కటే ఊదరగొడుతూ వస్తోంది.

మళ్ళీ మరోమారు మాజీ ఎమ్మెల్సీ టీడీపీ ఉత్తరాంధ్రా జిల్లాల ఇంచార్జి బుద్ధా వెంకన్న నోట అదే మాట పలికింది. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జీవీఎంసీలో జరుగుతున్నాయి. మొత్తానికి మొత్తం వైసీపీ స్వీప్ చేసే సీన్ ఉంది అక్కడ. మరి ఏమైనా ఉంటే ఒక్క కమిటీ చైర్మన్ అయినా గెలుచుకుని టీడీపీ పెద్దలు మాట్లాడితే అది గొప్ప కదా అని అంటున్నారు.

దాన్ని పక్కన పెట్టి ఎన్నికలు ఎపుడు వచ్చినా మేము సిద్ధమని టీడీపీ నేతలు అంటున్నారు. అయినా వారికి తెలియదా ఎన్నికలు ఈ ఏడాది కానీ వచ్చే ఏడాది కానీ లేనేలేవని, 2024 మార్చి దాకా వైసీపీ పవర్ లో ఉంటుందని.

వైసీపీకి ప్రజా వ్యతిరేకత ఉందని అంటూ తమ్ముళ్లు చెబుతున్న మాటలకు ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకు ఎక్కడా పోలిక అయితే లేదు. మరి ఇంతలా కళ్ల ముందు సీన్ కనిపిస్తున్నా ఎపుడు ఎన్నికలు పెట్టినా సిద్ధం, మేమే వచ్చేస్తామని తెల్లారుతూనే పాత పాట పాడుతూండడం టీడీపీకి ఎలా ఉందో కానీ జనాలకు అయితే అలవాటైపోయిన రొటీన్ పాటలా ఉంది అంటున్నారు.