విశాఖ జిల్లాలో అన్ని ఫలితాలకూ భీమునిపట్నం రిజల్ట్ కి అతి పెద్ద తేడా ఉందని అంటున్నారు. మిగిలిన చోట్ల గట్టిగా ఇరవై రౌండ్లు కంటే ఎక్కువ లేవు. అన్ని చోట్ల రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల దాకానే ఓట్లు పోల్ అయ్యాయి.
భీమిలీలో అయితే ఇంకా ఎక్కువ పోల్ అయ్యాయని చెబుతున్నారు. అక్కడ మొత్తం ఓటర్లే మూడు లక్షల అరవై వేల పై దాటి ఉన్నారు. ఇందులో ఎనభై శాతం దాకా పోలింగ్ జరిగింది అని అంటున్నారు. అంటే దాదాపుగా మూడు లక్షల ఓట్లు లెక్కించాల్సి ఉంటుంది. అందుకే పాతిక రౌండ్లు దాకా లెక్కిస్తే తప్ప భీమునిపట్నం ఫలితం తేలదు అని అంటున్నారు. భీమిలీ తుది ఫలితం జూన్ 4 వ తేదీ రాత్రి ఏడు ప్రాంతంలో వస్తుంది అని అంటున్నారు. ఇంకా లేట్ అయినా కావచ్చు అంటున్నారు.
భీమిలీలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీ నుంచి పోటీ చేస్తూంటే మరో మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య ఒక స్థాయిలో పోరు సాగింది అని అంటున్నారు. విజేతను కొందరు అంచనా వేస్తూంటే కొందరు టైట్ ఫైట్ గా చూపిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ లో భీమిలీ రిజల్ట్ గురించి ఒక క్లారిటీ రావచ్చు అని అంటున్నారు.
విశాఖ జిల్లాలో పశ్చిమ నియోజకవర్గం నుంచి తొలి ఫలితం వస్తుంది అని అంటున్నారు. అక్కడ రెండు లక్షల పై దాటి ఓట్లు పోల్ అయ్యాయి ఇరవై రౌండ్లు కంటే తక్కువ అంటున్నారు. దాంతో మధ్యాహ్నం రెండు గంటలకే ఫలితం తెలిసిపోతుంది అని అంటున్నారు. ఇక్కడ కూడా వైసీపీ టీడీపీల మధ్య భీకరమైన పోరు సాగింది. విజేత మీద రకరకాలైన అంచనాలు ఉన్నాయి.