‘‘రాష్ట్రానికి కొన్ని వందల వేల పరిశ్రమలు తరలి వచ్చేశాయి. అవన్నీ కూడా మామూలు పరిశ్రమలు కాదు.. అంతర్జాతీయంగా ఎంతో పేరున్న అగ్రగామి పరిశ్రమలు, సంస్థలు! ఆ సంస్థలన్నీ రాష్ట్రంలోని యువతరం అందరికీ పిలిచి మరీ ఉద్యోగాలు ఇచ్చేశాయి. రాష్ట్రంలో ఇప్పుడు అంతో ఇంతో చదువుకున్న యువత దుర్భిణి వేసి వెతికినా కనిపించడం లేదు. వందల వేల పరిశ్రమలు రావడంతో యాభై లక్ష్లల మంది యువతరం.. అద్భుతమైన ఉద్యోగాలు చేసుకుంటున్నారు.. వారి జీవితాలు గొప్పగా వెలుగొందుతున్నాయి.. రాష్ట్రంలో అసలు పేదవాడు అనే మనుషులే కనిపించడం లేదు.. అంతా అద్భుతంగా జీవిస్తున్నారు..’’
ఈ తరహాలో వరుసగా మాటలు పేర్చుకుంటూ పోయి.. చిట్టచివరన్న ‘‘నిన్ననే ఈ కల వచ్చింది. ఇంతకూ ఈ కల ఎప్పుడు వచ్చిందనుకున్నారూ..? తెల్లవారుజామున వచ్చింది. తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయని పెద్దలు అంటారు కదా. అలాగే మరి నా కల కూడా నిజం అవుతుందన్నమాట’’! ..అని ఏదో టీకొట్టు దగ్గర, కిళ్లీ బంకు దగ్గర నిల్చున్న అధికార కూటమి అభిమాని మాట్లాడితే చెల్లుతుంది. ప్రభుత్వంలో భాగంగా ఉండే ఒక బాధ్యతగల మంత్రి స్థాయిలోని వ్యక్తి చెబితే ఎలా ఉంటుంది.
ప్రజలకు ఎక్కడ కాలాలో అక్కడ కాలుతుంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే ఎనిమిది నెలలు గడచిపోతుండగా.. వారు ఏవైతే పరిశ్రమలు, ప్రాజెక్టులు అంటూ ఊదరగొడుతూ ఉంటారో.. ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. కానీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ మాత్రం.. తన కలలను, ఊహలను.. అంచనాలుగా మార్చి ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు.
దావోస్ వెళ్లి వచ్చిన తర్వాత.. చంద్రబాబునాయుడు ఢిల్లీలోనూ, నారా లోకేష్ అమరావతిలోనూ.. తమ వంతుగా.. తాము దావోస్ కు వెళ్లి ఏం సాధించుకు వచ్చామో ఒక అబద్ధపు డప్పు కొట్టుకున్నారు. దావోస్ లో ఒప్పందాలు కుదరవు.. కేవలం చర్చలు, మంతనాలు మాత్రమే ఉంటాయి.. అంటూ ఏపీ ప్రజలను వంచించే ప్రయత్నం కూడా చేశారు.
ఇంకా నయ్యం.. దావోస్ లో ‘మనం ఇచ్చే గిఫ్టులు తీసుకుని, మనం కప్పే శాలువాలు పుచ్చుకుంటారు తప్ప.. మనతో సంతకాలు ఎవరూ చేయరు..’ అనే మాట వారు చెప్పలేదు. తండ్రీకొడుకులు ఆ వివరాలు చెప్పిన తర్వాత.. వారితోపాటు వెళ్లిన పరిశ్రమల మంత్రి టీజీ భరత్ తన వంతుగా కర్నూలులో విలేకర్లతో మాట్లాడి.. తన శక్తివంచన లేకుండా రాష్ట్రాన్ని మభ్యపెడుతున్నారు. ఆయన చెబుతున్నవన్నీ ఊహలే, అంచనాలే! అయినా సరే.. ఉద్యోగాలు వచ్చేసినంత ఘాటుగా చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. దావోస్ లో తమ బృందం ఐదురోజుల వ్యవధిలో వందకు పైగా సమావేశాలు జరిపిందిట. అక్కడి పారిశ్రామికవేత్తల స్పందన చూసిన తర్వాత.. అయిదేళ్లలో ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయని ఆయనకు ‘అనిపించిందట’!
అనిపించిన, తలపోసిన, ఊహించిన విషయాలను కూడా ప్రజలను ఏదో ఉద్ధరించేస్తున్నట్టుగా మాట్లాడడం.. కనీసం ఒక్క ఒప్పందం కుదరకుండా, ఒక్క ప్రాజెక్టు కూడా రాకుండానే.. మాయమాటలు చెప్పడం కూటమి నాయకులకు అలవాటే అని ప్రజలు అనుకుంటున్నారు.
Nine, three, eight, zero, five, three, seven, seven, four, seven nvc
Seven, nine, nine, seven, five, three, one, zero, zero, four :- CB work
Nine, three, eight, zero, five, three, seven, seven, four, seven nvc