వైసీపీ పండ‌గ జ‌రుగుతుంటే…నేను ఇంట్లో కూచోవాలా?

స్పీక‌ర్ ప‌ద‌విలో ఉండి అధికార పార్టీ ప్లీన‌రీకి త‌మ్మినేని సీతారాం హాజ‌రు కావ‌డంపై టీడీపీ అనుకూల ప‌త్రిక ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించింది. పార్టీల‌కు అతీత‌మైన ప‌ద‌వి స్పీక‌ర్ హోదా అని ఆ ప‌త్రిక గుర్తు చేసింది.…

స్పీక‌ర్ ప‌ద‌విలో ఉండి అధికార పార్టీ ప్లీన‌రీకి త‌మ్మినేని సీతారాం హాజ‌రు కావ‌డంపై టీడీపీ అనుకూల ప‌త్రిక ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించింది. పార్టీల‌కు అతీత‌మైన ప‌ద‌వి స్పీక‌ర్ హోదా అని ఆ ప‌త్రిక గుర్తు చేసింది. ఈ నేప‌థ్యంలో త‌న గురించి ప్ర‌త్యేకంగా బాబు అనుకూల మీడియా ప్ర‌శ్నించ‌డంపై త‌మ్మినేని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

వైసీపీ ప్లీన‌రీ రెండో రోజు ప్రారంభ ఉప‌న్యాసం ఆయ‌న మొద‌లు పెట్టారు. పరిపాలన వికేంద్రీకరణ- పారదర్శకతపై ఆయ‌న ప్ర‌సంగిస్తూ త‌న‌పై విమ‌ర్శ‌ల‌కు ఘాటుగా స‌మాధానం ఇచ్చారు.  ఆయ‌న ఏమ‌న్నారంటే…

'స్పీకర్‌ పదవిలో ఉండి ప్లీనరీకి ఎలా హాజరవుతారంటూ నాపై కథనాలు రాశాయి. గతంలో టీడీపీ మహానాడులో ఆనాటి స్పీకర్‌ శివప్రసాద్‌ పాల్గొనలేదా?. ఆ రోజు ఆయన మాట్లాడింది మీరు వినలేదా? మీరు కనలేదా?. ఆయన మ‌హానాడుకు హాజరవగా లేనిది.. నేను ప్లీనరీలో పాల్గొంటే తప్పా?. నేను వైఎస్సార్‌సీపీ ప్రాథమిక సభ్యుడిని. తర్వాతే ఎమ్మెల్యేను..ఆ తర్వాతే స్పీకర్‌ను. ప్లీనరీ పండగ జరుగుతుంటే.. నేను ఇంట్లో కూర్చోవాలా?' అంటూ బాబు అనుకూల మీడియాని త‌మ్మినేని ప్ర‌త్యేకంగా పేర్లు ప్ర‌స్తావించి ప్ర‌శ్నించారు.

గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని సీఎం జగన్‌ తీసుకొచ్చార‌న్నారు. వీటి గురించి ఎల్లో మీడియా ఎందుకు రాయ‌దంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు. అవి పచ్చ పత్రికలు కాదు.. పక్షపాత పత్రికలంటూ ధ్వ‌జ‌మెత్తారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 175 స్థానాలు గెలిచి తీరుతుంద‌ని తమ్మినేని సీతారాం ధీమా వ్య‌క్తం చేశారు.