జగన్ మీద గెలవాలనేది పవన్ కల్యాణ్ కల! అందుకే ఏది తోస్తే అది మాట్లాడడం ఆయన తీరు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగాలేదు అనే అభిప్రాయం ప్రజల్లో కలిగించడానికి ఎలాగైతే అర్థం పర్థంలేని విమర్శలు చేస్తూ ఉంటారో.. అదే తీరుగా.. జగన్ మీద అనేక రకాలుగా విముఖత కలిగించడానికి కూడా వక్రప్రయోగాలు చేస్తుంటారు.
జగన్మోహన్ రెడ్డి హిందువు కాదని, క్రిస్టియన్ అని పదేపదే గుర్తు చేయడం ద్వారా కూడా ఇలాంటి వేషాలు వేస్తుంటారు. తాజాగా అలా గుర్తు చేయడానికి ఓ బైబిలు వాక్యాన్ని కూడా పవన్ ఉదాహరించారు.
‘తనను తాను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడును’ అనేది బైబిల్ వాక్యం అట. దానిని పవన్ కల్యాణ్ తూచా తప్పకుండా పాటిస్తాడుట. 2014లో తాను తగ్గి రాష్ట్రాన్ని గెలిపించాడుట.. ఇలా సొల్లు చెబుతున్నారు పవన్ కల్యాణ్.
బైబిల్ వాక్యం నిజమే కానీ.. 2014లో పవన్ చేసింది తగ్గడం కాదు.. పలాయనం.! తనకు ఎన్నికల్లో పోటీచేసే సత్తా లేక.. రాష్ట్రంలో నిలబెట్టడానికి పట్టుమని పదిమంది మనుషులు కూడా లేక.. పరువు పోతుందనే భయంతో.. తగ్గినట్టుగా నటించి, త్యాగమూర్తి ముద్రను కోరుకుంటూ.. ప్యాకేజీ మాట్లాడుకుని చంద్రబాబును గద్దెమీదికి తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి నానా పాట్లు పడ్డారు.
2019లో మాత్రం పవన్ ఎందుకు తగ్గలేదు? అనే డౌటొస్తుంది. అప్పటికి తన పార్టీ బలం ముదిరిపోయిందని ఆయనకు అనిపించింది. అందుకే బరిలోకి దిగి తల బొప్పి కట్టించుకున్నారు. 2019లో రాష్ట్రమంతా పోటీచేసి ఏమీ పీకలేకపోయిన ఆయన.. 2014లోని తన చేతగాని తనానికి ‘తగ్గడం’ అని సిగ్గులేకుండా పేరు పెట్టుకుంటున్నారు.
నిజానికి బైబిలులో చెప్పిన ‘తగ్గడం’ అంటే అది కాదు పవన్ బాబూ.. అహంకారం తగ్గించుకోవడం. ఈ జన్మలో అది నీకు ఎప్పటికీ తగ్గదు.. అని పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. బైబిలులో చెప్పిన తగ్గడం అనేది.. అచ్చంగా సినిమాలకు వర్తిస్తుందని అంటున్నారు.
పవన్ తన రెమ్యునరేషన్ తగ్గించుకుంటే.. హీరోగా మరింత ఎదుగుతాడని, మరిన్ని సినిమాలు చేయొచ్చునని.. బైబిలు చెప్పినట్టు తగ్గడం ద్వారా హెచ్చింపబడడం అంటే అర్థం అదే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.