ఏజెన్సీ ఎర్రబారుతోంది

కొత్తగా ఏర్పడిన ఏజెన్సీ జిల్లా అల్లూరి సీతారామరాజు ప్రాంతమంతా ఇపుడు ఎర్రబారుతోంది. ఈ రోజు నుంచి ఈ నెల 27 వరకూ మావోయిస్ట్ పార్టీ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. దాంతో అటు పోలీసులు ఇటు మావోల…

కొత్తగా ఏర్పడిన ఏజెన్సీ జిల్లా అల్లూరి సీతారామరాజు ప్రాంతమంతా ఇపుడు ఎర్రబారుతోంది. ఈ రోజు నుంచి ఈ నెల 27 వరకూ మావోయిస్ట్ పార్టీ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. దాంతో అటు పోలీసులు ఇటు మావోల మధ్యన ఏజెన్సీ ప్రాంతం నలుగుతోంది.

ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలసిపోయారు. దాంతో ఆంధ్రా ఒడిషా బోర్డర్ లో మావోలకు గట్టి దెబ్బ తగిలింది. దాంతో కొత్త క్యాడర్ ని తయారు చేసుకునేందుకు తమ పాత బలాన్ని పొందేందుకు మావోలు ఏజెన్సీలో ఈ వారోత్సవాలను ప్రతిష్టగా తీసుకుంటున్నారు.

పోలీసులు సైతం మావోల వారోత్సవాల సందర్భంగా ఎలాంటి అలజడులు చోటు చేసుకోకుండా గట్టి గస్తీని ఏర్పాటు చేశారు. పారా మిలటరీ దళాలను రంగంలోకి దించి మరీ మావోల యాక్టివిటీని కనిపెట్టి పనిపట్టడానికి పోలీసులు రెడీగా ఉన్నారు.

గతంతో పోలిస్తే ఏజెన్సీలో మావోల పట్టు కొంత తగ్గింది. పోలీసులు గిరిజనులతో నేరుగా సంబంధాలను కొనసాగించడమే కాకుండా పటిష్టమైన ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. దాంతో మావోలు కూడా తమ ఉనికిని చాటుకునేందుకు వారోత్సవాలలో అనేక‌ కీలక నిర్ణయాలను తీసుకుంటారు అని తెలుస్తోంది.  

కొత్త వారిని కూడా చేర్చుకునే ప్రక్రియను చేపడతారు. వారం పాటు అటూ ఇటూ తుపాకీ గురి పెట్టి ఉన్న నేపధ్యంలో కొత్త జిల్లా ఏజెన్సీలో ఎటు చూసినా యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది.