గిరిజన వర్శిటీ కోసం తమ్ముళ్ల పోటా పోటీ!

కేంద్ర ప్రభుత్వం పదేళ్ళుగా విభజన చట్టంలోని హామీలను అమలు చేయడం లేదు. అందులో విజయనగరం జిల్లాకు కేటాయించిన గిరిజన విశ్వవిద్యాలయం ఒకటి. ఈ విశ్వవిద్యాలయం పదేళ్ళు అయినా పూర్తి కాలేదు. దానికి కారణం టీడీపీ…

కేంద్ర ప్రభుత్వం పదేళ్ళుగా విభజన చట్టంలోని హామీలను అమలు చేయడం లేదు. అందులో విజయనగరం జిల్లాకు కేటాయించిన గిరిజన విశ్వవిద్యాలయం ఒకటి. ఈ విశ్వవిద్యాలయం పదేళ్ళు అయినా పూర్తి కాలేదు. దానికి కారణం టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వాలు వర్శిటీని వేరు వేరు ప్రాంతాలకు తరలించి శంకుస్థాపన చేశాయి.

కొత్తవలసలోని రెల్లి గ్రామంలో టీడీపీ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిర్ణయించి శంకుస్థాపన చేస్తే వైసీపీ వచ్చాక సాలూరు నియోజకవర్గం మెంటాడలో ఏర్పాటుకు ప్రతిపాదించారు.శంకుస్థాపన చేశారు. కేంద్రం నిధులు ఇస్తేనే ఈ విశ్వవిద్యాలయం పూర్తి అయ్యేది.

కానీ బడ్జెట్ లో నిధులు అరకొరగా ఈ విశ్వవిద్యాలయానికి కేటాయించడంతో నిర్మాణం పనులు సాగడం లేదు. ఇపుడు మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గిరిజన వర్శిటీ కొత్తవలసకు తరలిపోతుందని ప్రచారం మొదలైంది. ఎస్ కోట టీడీపీ ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి ఈ మేరకు ప్రభుత్వ పెద్దలను కలసి విన్నవించారని కూడా ప్రచారం సాగింది.

టీడీపీ హయాంలో కొత్తవలసకే కేటాయించారు కాబట్టి అక్కడికే వర్శిటీ రావాలన్నది అక్కడి టీడీపీ నేతల పట్టు. అయితే సాలూరుకి వైసీపీ ఎటూ తెచ్చేసింది కాబట్టి అక్కడే నిర్మిస్తామని అక్కడి టీడీపీ నేతలు చెబుతున్నారు. సాలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలను నిర్వహిస్తున్న గుమ్మడి సంధ్యారాణి ఈ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

గిరిజన విశ్వవిద్యాలయం ఎక్కడికీ తరలిపోదని సాలూరు నియోజకవర్గం లో నిర్మించడం జరుగుతుందని ఆమె భరోసా ఇచ్చారు. అక్కడే శంకుస్థాపన జరిగింది కాబట్టి మరి వేరే చోటకు వెళ్ళడం జరగదు అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సుముఖంగా ఉన్నారని చెప్పారు.

అయితే సాలూరు ఎమ్మెల్యేగా ఆమె ఈ మాట అంటున్నా ఎస్ కోట టీడీపీ తమ్ముళ్ళు మాత్రం తమ ప్రాంతానికే విశ్వవిద్యాలయం రావాలని పట్టుబడుతున్నారు. ఈ సమస్యను టీడీపీ అధినాయకత్వం పరిష్కరించాల్సి ఉంది.

5 Replies to “గిరిజన వర్శిటీ కోసం తమ్ముళ్ల పోటా పోటీ!”

  1. అమెరికా, కెనడా లాంటి దేశాల్లో ఎక్కడైతే ఫస్ట్ నేషన్స్ ఎక్కువగా వుంటారో, అక్కడ ఫస్ట్ నేషన్స్ యూనివర్సిటీ సెంటర్, ప్రధాన యూనివర్సిటీ కి అనుసంధానం చేస్తారు. అలానే చెయ్యొచ్చు దీనికి కొట్లాట ఎందుకు. ముందు గిరిజన యూనివర్సిటీ సిలబస్ డెవలప్ చెయ్యండి. కొండలు , అటవీ సంపద రక్షించడం, వాళ్ళ సంస్కృతి ని కాపాడటం, ఉత్పత్తులకు మార్కెటింగ్ డెవలప్ చెయ్యడం. కానీ అపురూప ఖనిజాల సంరక్షణ మైనింగ్ కోసం మినహాయింపు ఇవ్వాలి, లేక పోతే NGO లు అవకాశం గా తీసుకుని వేదాంత కాపర్ ఎక్సకేవషన్ మూయించినట్టు మూయిస్తారు.

  2. ఇంకో పదేళ్లు ఇలాగె ఊరూరు తిప్పితే తర్వాత పాతరేసేద్దాం. యూనివర్సిటీ పెట్టి జీవికకు వర్తకం విలువ తెలిసొచ్చాక, విద్యార్థి గిరిజనుడ లేక మాయోపాయం తెలిసిన నాగరీకుడ. ఎక్కడ జల్లడి వేసి వెతుకుతారు అమాయక, స్వేచ్ఛ గిరిజనాన్ని , నాగరీకం ఉక్కుపాదాల క్రింద అదిమి పెట్టి , స్వేచ్ఛా లాగేయడానికి

Comments are closed.