జగన్ గురించి బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ మీద బీజేపీ సీనియర్ నేత ఏపీ బీజేపీ మాజీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో జరిగిన బీజేపీ సంస్థాగత కార్యక్రమంలో పాల్గొన్న…

ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ మీద బీజేపీ సీనియర్ నేత ఏపీ బీజేపీ మాజీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో జరిగిన బీజేపీ సంస్థాగత కార్యక్రమంలో పాల్గొన్న సోము వీర్రాజు జగన్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మాజీ సీఎం జగన్ ఆలోచనలను అంచనా వేయడం చాలా కష్టం అని సోము వీర్రాజు అన్నారు. ఆయన ఏమి ఆలోచిస్తారు అన్నది కూడా అంతు బట్టదని అన్నారు. అంటే జగన్ ఆలోచనలు పసిగట్టలేకపోవడం కూడా జగన్ తప్పే అన్నట్లుగా ఆయన మాట్లాడారు అని అంటున్నారు.

సాధారణంగా రాజకీయ పార్టీల అధినేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. వారు గుంభనంగా ఉంటారు. అందువల్ల వారి ఆలోచనలు ఎవరికీ అంచనా వేయడం కుదరని పని. అలాగే జగన్ కూడా ఉండి ఉండొచ్చు. కానీ సోము వీర్రాజు జగన్ ని అంచనా వేయడం కష్టం అంటూ ఆయన మీద విమర్శలు చేశారు.

జగన్ అవగాహన లేమితో ఏపీలో పాలన సాగించారు అని కూడా నిందించారు. ఆయన రాజధానికి అయిదు రూపాయలు కూడా ఖర్చు చేయలేదని అన్నారు. విశాఖ రాజధాని అని చెప్పినా అభివృద్ధి జరగలేదని సోము అన్నారు.

ఆ పేరు చెప్పి జగన్ అయిదు వందల కోట్లతో రుషికొండ వద్ద భారీ భవనం నిర్మించారు అని ఆయన విమర్శించారు. విశాఖలో వరస ఫార్మా ప్రమాదాల మీద కూటమి ప్రభుత్వం పూర్తి విచారణ జరిపించాలని సోము వీర్రాజు కోరారు.

విశాఖ అంటేనే ప్రపంచమంతా తెలిసిన నగరం అని అలాంటి నగరంలో ఫార్మా కంపెనీలలో భద్రతా లోపాలు ఉండడం తరచూ ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగించే విషయం అని సోము అన్నారు. విశాఖ ఇమేజ్ కాపాడాలంటే ప్రమాదాలు జరగకుండా అడ్డు కట్ట వేయాలని ఆయన సూచించారు.

6 Replies to “జగన్ గురించి బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు”

  1. బెటర్ లేట్ than నెవర్ అని

    ల0గా leven గాడు మాట మీద నిలబడ’లేని, విశ్వసనీయత అసలే ‘లేని కుక్క’వంకర బుద్ధి.. అని Andra జనాలు 2021 లోనే తేలుసుకున్నారు.. నువ్వే ఈడి కుక్క బుద్ధి ఇప్పుడు కనుక్కుంటున్నావు సోమ్.

  2. బెటర్ లేట్ than నెవర్ అని

    ల0గా leven గాడు మాట మీద నిలబడ’లేని, విశ్వసనీయత అసలే ‘లేని కుక్క’వంకర బుద్ధి.. అని Andra జనాలు 2021 లోనే ‘తేలుసుకున్నారు.. నువ్వే ఈడి ‘కుక్కబుద్ధి ఇప్పుడు కనుక్కుంటున్నావు సోమ్.

  3. Professor నాగేశ్వర్ మాత్రం సోంవీర్రాజు అంటాడో, ఆ పేరుని అడ్డం పెట్టుకొని సోంబేర్రాజు అంటాడో అర్ధం కాదు.

Comments are closed.