బాబును ఉతికి ఆరేస్తున్న నెటిజ‌న్లు

హౌస్ రిమాండ్‌కు ఆదేశించాల‌ని చంద్ర‌బాబు దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ఉతికి ఆరేస్తున్నారు. ఖైదీల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం ఉండ‌దు చంద్ర‌బాబూ అంటూ నెటిజ‌న్లు త‌మ సృజ‌నాత్మ‌క‌త‌కు ప‌దును పెడుతూ సృష్టించిన…

హౌస్ రిమాండ్‌కు ఆదేశించాల‌ని చంద్ర‌బాబు దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ఉతికి ఆరేస్తున్నారు. ఖైదీల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం ఉండ‌దు చంద్ర‌బాబూ అంటూ నెటిజ‌న్లు త‌మ సృజ‌నాత్మ‌క‌త‌కు ప‌దును పెడుతూ సృష్టించిన పోస్టులు వైర‌ల్ అవుతున్నాయి. హౌస్ రిమాండ్‌పై ఏసీబీ కోర్టులో ఇప్ప‌టికే వాద‌న‌లు పూర్తి అయ్యాయి. తీర్పు కాసేప‌ట్లో వెలువ‌డే అవ‌కాశం ఉంది.

ఈ నేప‌థ్యంలో సీఐడీ త‌ర‌పు వాదించిన ప్ర‌ముఖ న్యాయ‌వాది పొన్న‌వోలు సుధాక‌ర్‌రెడ్డి ఒక చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఖైదీల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం అనే సౌక‌ర్యం వుండ‌ద‌ని చ‌మ‌త్క‌రించారు. ఈ కామెంట్స్ ఆధారంగా చేసుకుని నెటిజ‌న్లు త‌మ‌దైన రీతిలో బాబుకు చీవాట్లు పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇందుకు సంబంధించి వైర‌ల్ అవుతున్న ఒక వ్యంగ్య పోస్టు గురించి తెలుసుకుందాం.

“కాలం ఎంత గొప్ప‌దో చూసావా …జాన‌కీ!.. మొన్న‌టికి మొన్న ..పోలీసుల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం ఇస్తాన‌న్నాడు. ఇప్పుడు… నేను జైల్లో వుండ‌లేను, నాకు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం ఇవ్వాల‌ని అడుగుతున్నాడు…ఖైదీనంబ‌ర్ 7691” అంటూ చంద్ర‌బాబు జైల్లో వున్న ఫొటోతో పాటు మ‌రో ఇద్ద‌రి ఫొటోల‌తో కూడిన పోస్ట్ వైర‌ల్ అవుతోంది. 

చంద్ర‌బాబు జైల్లో ఉన్నా జాలి చూప‌డం లేదు. ఆయ‌న వేసుకున్న పిటిష‌న్‌పై నెటిజ‌న్లు వెట‌కారం చేస్తున్నారు. ఎవ‌రూ ఎవ‌ర్నీ నియంత్రించ‌లేని ప‌రిస్థితి. అస‌లే ఎన్నిక‌ల సీజ‌న్‌. ఇలాంటివి రానున్న రోజుల్లో మ‌రెన్నో చూడాల్సి వుంటుంది.