ఇలా ట్రోల్ చేస్తే బాధ‌గా వుండ‌దాండి!

ప‌దో త‌ర‌గతి విద్యార్థులు పెద్ద సంఖ్య‌లో ఫెయిల్ కావ‌డంపై జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఫెయిల్ అయిన విద్యార్థులంద‌రికీ ప‌ది గ్రేస్ మార్కులివ్వాల‌ని ప‌వ‌న్ కోర‌డంపై నెటిజ‌న్లు సెటైర్లు విసురుతున్నారు.  Advertisement…

ప‌దో త‌ర‌గతి విద్యార్థులు పెద్ద సంఖ్య‌లో ఫెయిల్ కావ‌డంపై జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఫెయిల్ అయిన విద్యార్థులంద‌రికీ ప‌ది గ్రేస్ మార్కులివ్వాల‌ని ప‌వ‌న్ కోర‌డంపై నెటిజ‌న్లు సెటైర్లు విసురుతున్నారు. 

ప‌వ‌న్ ప్ర‌తి స్పంద‌న‌పై వెంట‌నే ట్రోలింగ్ స్టార్ట్ అవుతుండ‌డంతో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, అభిమానులు మండిప‌డుతున్నారు. విధానాల ప‌రంగా ప‌వ‌న్ మాట్లాడినా వ్యంగ్య కామెంట్స్ చేస్తున్నార‌ని వారు బాధ‌ప‌డుతున్నారు.

ఫెయిల్ అయిన వారికి పది గ్రేస్ మార్కులు ఇవ్వాలనే ప‌వ‌న్ కామెంట్‌పై నెటిజ‌న్లు సృజ‌న‌కు ప‌దును పెట్టారు.  

“అవును, ఒక్కడు కూడా చదివి పాస్ కాకూడదు నాలాగా ! సంక నాకి పోవాలి. ప్రతి పిల్లవాడి జీవితం నాలాగే, చదువు లేక, చదువు రాక, చదువు వచ్చునని నటించడం చేతగాక !! లక్ష పుస్తకాలు చదివానని నమ్మిస్తూ తిరగడం చేతగాక” అని నెటిజ‌న్లు సెటైర్ కామెంట్ చేశారు.

సినిమా బాగాలేక పోయినా, ప్రేక్ష‌కులు థియేట‌ర్‌కు రాక‌పోయినా, ప‌రువు కోసం ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగించిన అనుభ‌వం నుంచి ప్ర‌భుత్వానికి గ్రేస్‌మార్కులు క‌ల‌పాల‌నే గొప్ప ఐడియా ఇచ్చాడేమో అని మ‌రికొంద‌రు వెట‌క‌రించారు. 

చ‌దువంటే జ్ఞాన‌మ‌ని, ఉత్తుత్తి స‌ర్టిఫికెట్ల‌తో లాభం లేద‌ని …పాస్ మార్కులు వేయాల‌ని డిమాండ్ చేస్తున్న అజ్ఞాత‌వాసికి ఎలా తెలుస్తుందో అనే వాళ్లు లేక‌పోలేదు. ఇలా ప‌వ‌న్‌పై సోష‌ల్ మీడియాలో సెటైర్లు ఓ రేంజ్‌లో పేలుతున్నాయి.