ఓటుకు టీఆర్ఎస్ 40వేలు.. బీజేపీ 30వేలు

మనం మాట్లాడుతుంది నిజమే. త్వరలో జరగబోయే మునుగోడు ఉపఎన్నిక‌లో ఒకొక్క ఓటుకు 40 నుండి 30 వేలు ఇవబోతునట్లు బీజేపీ, టీఆర్ఎస్ నేతలే చెపుతున్నారు. 20వేల కోట్ల కాంట్రాక్టు పనులు బీజేపీ ద్వారా ద‌క్కించుకున్నా…

మనం మాట్లాడుతుంది నిజమే. త్వరలో జరగబోయే మునుగోడు ఉపఎన్నిక‌లో ఒకొక్క ఓటుకు 40 నుండి 30 వేలు ఇవబోతునట్లు బీజేపీ, టీఆర్ఎస్ నేతలే చెపుతున్నారు. 20వేల కోట్ల కాంట్రాక్టు పనులు బీజేపీ ద్వారా ద‌క్కించుకున్నా కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఓటుకు 30వేలు ఇవ్వబోతున్నారు అంటూ టీఆర్ఎస్ పార్టీ మునుగోడు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చెప్పితే. అలాగే లక్ష కోట్లు అక్రమంగా సంపాదించినా సీఎం కేసిఆర్ ఓటుకు 40వేలు ఇవ్వ‌బోతున్న‌రాని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజాయ్ తెలిపారు.

మొత్తానికి టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కలిపి 70వేలు ఒక ఓటరు ఇస్తే కనీసం కాంగ్రెస్ పార్టీ ఒక 10వేలు ఇచ్చిన ఓటు 80 వేలు ప‌లుక‌పోతున్నట్లు కనపడుతోంది. ఒక ఓటు 80 వేలు అయితే ఇద్దరు ఉంటే 1.6లక్షలు. మొత్తానికి మునుగోడు ఎన్నికల పుణ్యమా అన్ని అక్కడి ప్రజలు లక్షధికారులు కాబోతున్నారు.

ఇరు పార్టీలు ఒకరికి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్న డబ్బు పంపిణీ మాత్రం కాస్త గట్టిగానే కనపడుతున్నట్లు కనపడుతోంది. గతంలో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కూడా ఓటు 10వేలు పలికిందని అందుకే ఈసారి రాజకీయ పార్టీలే అటు ఇటు గా 20వేలు పంచడానికి అయినా సిద్ధంగా ఉన్నట్లు కనపడుతోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. హుజురాబాద్ ఎన్నిక‌ల టైంలో డ‌బ్బు పంచలేద‌ని ఓటర్లు ధర్నాలు చేసిన సంద‌ర్భాలు కూడా చూశాం బ‌హుశ మునుగోడులో డ‌బ్బు కొంద‌రికి ఇచ్చే కొంద‌రికి అంద‌క‌పోతే ప్ర‌జ‌లు ధర్నాలు చేయ‌వ‌చ్చు.

మునుగోడు ఉప ఎన్నిక జాతీయ రాజకీయాల్లో వెళ్తున్న కేసిఆర్ కు ఎంత ముఖ్యమో ఎలాగైనా తెలంగాణాలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ కూడా అంతే ముఖ్యం. బహుశా అందుకే రాజకీయ నేతలు ఇప్పటి నుండే ఓటు రేటు ఫిక్స్ చేస్తున్నట్లు కనపడుతుంది.

కేంద్రంలో అధికారంలో ఉండి స్వయానా పెద్ద ధనవంతుడు అయినా కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి… రాష్ట్రంలో అధికారంలో ఉండి బాగా సంపాదించినా ప్రభాకర్ రెడ్డి ఇరువురు చెప్పినంత డబ్బు ఇవ్వకపోయిన హుజురాబాద్ లో కంటే ఎక్కువ ఇస్తారు అనేది వాస్తవం క‌న‌ప‌డుతోంది. కానీ ఈ ఇరు పార్టీల మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఎలా మునుగోడు ఎన్నికల్లో నెగ్గుకు వస్తుందనేదే అస‌క్తిగా ఉంది.

ఇంక ముందు ఏ ఎన్నికల్లో అయినా డబ్బు పంపిణి లేకుండా జరగవు అనేది నగ్న సత్యం. బహుశా ఇకపై పెద్ద పెద్ద కార్పొరేట్ రాజ‌కీయా నాయ‌కులు తప్ప చిన్న చిత‌క నాయ‌కులు రాజకీయాకు చేయలేరు అనేది వాస్త‌వం.