ఉద్దానం వాటర్‌ ప్రాజెక్టు వైసీపీకి లాభమేనా…?

ఉద్దానం కిడ్నీ బాధితులు అన్నది జాతీయ సమస్యగా మారింది తప్ప పరిష్కారం అయితే దశాబ్దాలు గడచినా నోచుకోలేదు. Advertisement ముఖ్యమంత్రిగా జగన్‌ బాధ్యతలు స్వీకరించాక ఉద్దానం బాధితులకు ఉపశమనం కలిగించే చర్యలను తీసుకున్నారు. కిడ్నీ…

ఉద్దానం కిడ్నీ బాధితులు అన్నది జాతీయ సమస్యగా మారింది తప్ప పరిష్కారం అయితే దశాబ్దాలు గడచినా నోచుకోలేదు.

ముఖ్యమంత్రిగా జగన్‌ బాధ్యతలు స్వీకరించాక ఉద్దానం బాధితులకు ఉపశమనం కలిగించే చర్యలను తీసుకున్నారు.

కిడ్నీ రోగులకు పెన్షన్‌ సదుపాయం కలుగచేయడంతో పాటు వారి కోసం సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, రిసెర్చ్‌ సెంటర్‌లను ఏర్పాటుచేశారు.

వంశధార నది నుంచి ఎత్తిపోతల పధకం ద్వారా తరలించిన నీటితో ఉద్దానంలోని ఇంటింటికీ రక్షిత మంచినీటి సదుపాయం కోసం ఏడు వందల కోట్ల రూపాయలతో పధకాన్ని అమలుచేస్తున్నారు.

దీని వల్ల పలాసా, ఇచ్చాపురం పరిథిలో వేల కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. వచ్చే నెలలో ఉద్దానం వాటర్‌ ప్రాజెక్టుకు ముఖ్మమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభోత్సవం చేయనున్నారు. ఎన్నికల ముందు ఈ పధకం ఫలితాలు జనాలకు అందుతున్నాయి.

2019లో వైసీపీ గెలుచుకున్న పలాస సీటుతో పాటు గత రెండుసార్లు గెలవని ఇచ్చాపురంలోనూ ఈసారి విజయం తధ్యమని వైసీపీ భావిస్తోంది.

ఇదే కాకుండా శ్రీకాకుళం జిల్లాకు దాదాపుగా అయిదు వేల కోట్ల రూపాయలతో అనేక పధకాలను జగన్‌ మంజూరు చేశారని మూలపేట పోర్టుతో పాటు వంశధార రెండవ దశ పనులకు కూడా శ్రీకారం చుట్టారని చెప్పుకొచ్చారు.

ఇవన్నీ కలసి మరోమారు శ్రీకాకుళంలో పదికి పది సీట్లను తమ పార్టీ గెలుస్తుందని అంటున్నారు.