గాజువాక పవన్‌కు యాంటీ సెంటిమెంటా…?

గాజువాక నుంచి తొలిసారి పోటీ చేసి పవన్‌ కళ్యాణ్‌ ఓటమి పాలు అయ్యారు. 2019 ఎన్నికలలో ఆయన గాజువాకను తన పోటీకి ఎంచుకున్నారు.  ఆనాడు నామినేషన్‌కు పవన్‌ వస్తే గాజువాక మొత్తం తరలివచ్చింది. దాంతో…

గాజువాక నుంచి తొలిసారి పోటీ చేసి పవన్‌ కళ్యాణ్‌ ఓటమి పాలు అయ్యారు. 2019 ఎన్నికలలో ఆయన గాజువాకను తన పోటీకి ఎంచుకున్నారు.  ఆనాడు నామినేషన్‌కు పవన్‌ వస్తే గాజువాక మొత్తం తరలివచ్చింది. దాంతో గెలుపు గ్యారంటీ అనుకుని పవన్‌ పెద్దగా ప్రచారం చేయలేదు.

చిత్రమేంటి అంటే గాజువాకలో పవన్‌కి పడిన ఓట్లు కంటే విశాఖ నుంచి జనసేన తరఫున ఎంపీగా పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. దాంతోనే గాజువాక మీద పవన్‌కు విరక్తి కలిగింది అని అంటారు.

నాలుగేళ్ల కాలంలో పవన్‌ ఎపుడూ గాజువాకలో అడుగు పెట్టలేదు. వారాహీ మూడవ విడత యాత్రలో బహిరంగసభను గాజువాకలో నిర్వహించారు. జనం పెద్ద ఎత్తున వచ్చారు. తనకు లభించిన ఘనస్వాగతానికి పవన్‌ పొంగిపోయారు. అయినా సరే ఆయన తాను గాజువాక నుంచి పోటీ చేస్తానని మాత్రం ప్రకటించలేదు. దీంతో జనసేనలోనూ చర్చ సాగుతోంది.

పవన్‌ గాజువాక మీద ఆసక్తి చూపించడంలేదా అన్న సందేహాలు వస్తున్నాయి. తొలిసారిగా శుభమా అని పోటీ చేస్తే గాజువాక ఓటమి రుచి చూపించిందని యాంటీ సెంటిమెంట్‌గా జనసేనాని భావిస్తున్నారని అంటున్నారు.