ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన కామెంట్స్ చేశారు. తన గురించి అవాకులు చెవాకులు పేలితే అచ్చెన్నాయుడి చిట్టా విప్పుతానని ఆయన హెచ్చరించడం గమనార్హం. వంశీ ఘాటు విమర్శల నేపథ్యంలో ఇంతకూ అచ్చెన్నాయుడు అనుచితంగా ప్రవర్తించిన ఆ మహిళాధికారి ఎవరనే ప్రశ్న ఉత్పన్నమైంది.
గన్నవరంలో ఘోరాలు, నేరాలు జరిగిపోతున్నాయంటూ టీడీపీ గగ్గోలు పెట్టడంపై వంశీ సీరియస్‌గా స్పందించారు. అంత సీన్ లేదని ఆయన కొట్టి పారేశారు. చంద్రబాబుకి అధికారం లేకపోవడంతో తమ కుల పత్రికలు, చానళ్లు చాలా ఆవేదనలో ఉన్నాయని… సదరు మీడియ సంస్థల పేర్లను ఆయన ప్రస్థావించడం గమనార్హం. అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న లోకేశ్ మీసాలు మెలేయడంపై వల్లభనేని వంశీ వెటకరించారు.
లోకేశ్ మాడా డైలాగ్‌లకు ఎవరైనా భయపడతారా? లోకేశ్ తండ్రికే భయపడనోళ్లు, అతనికి భయపడతారా? అని ఆయన ప్రశ్నించారు. లోకేశ్‌కు ఒక్కడికే మీసం వుందా? ఎవడికి లేదు మీసం? మేకకు కూడా పొడవాటి గడ్డం వుంటుంది? అని దెప్పి పొడిచారు. ఎర్రన్నాయుడి లాంటి నాయకుడికి అచ్చెన్నాయుడు తమ్ముడు కావడం తమ ఖర్మ అన్నారు. అచ్చెన్నాయుడు ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కావడం ఇంకా ఖర్మ అన్నారు.
పార్టీ లేదు, బొక్కా లేదు, గట్టి చట్నీ వేయాలని అచ్చెన్న అన్నట్టుగా వీడియోలో చూశామన్నారు. దాన్ని మనం సృష్టించింది కాదు కదా అని ప్రశ్నించారు. పెళ్లి చేసుకుందామని ఢిల్లీకి చెందిన ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ప్రకటన ఇస్తే … అచ్చెన్నాయుడు మిస్ బిహేవ్ చేశాడని సంచలన ఆరోపణ చేశారు. ఆ తర్వాత చంద్రబాబు కాళ్లు అచ్చెన్నాయుడు పట్టుకున్నారన్నారు. ఆ తర్వాత ఆమెను చంద్రబాబు బతిమలాడుకున్నారన్నారు.
ఇలాంటివన్నీ చెబితే అచ్చెన్నాయుడు పరువు గంగలో కలిసిపోతుందన్నారు. తన గురించి అచ్చెన్నాయుడు మాట్లాడితే చిట్టా విప్పుతా అని వంశీ హెచ్చరించారు. వంశీ ఆరోపణలపై అచ్చెన్నాయుడు వాస్తవాలేంటో చెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే అచ్చెన్నాయుడిపై నెగెటివ్ సంకేతాలు వెళ్తాయి.