వలంటీర్ల వ్యవస్థ రద్దు చేస్తారా?

వైకాపా ప్రభుత్వం మరోసారి ఏర్పడకూడదనే పట్టుదలతో వ్యవహరస్తోంది తెలుగుదేశం అనుకూల మీడియా. అందుకు అనుగుణంగా రోజుకో కథనం వండి వారుస్తోంది. ఈరోజు టార్గెట్ వలంటీర్ వ్యవస్థ. నిజానికి ఈ వ్యవస్థ పల్లెల్లో జనాలకు ఎంతగానో…

వైకాపా ప్రభుత్వం మరోసారి ఏర్పడకూడదనే పట్టుదలతో వ్యవహరస్తోంది తెలుగుదేశం అనుకూల మీడియా. అందుకు అనుగుణంగా రోజుకో కథనం వండి వారుస్తోంది. ఈరోజు టార్గెట్ వలంటీర్ వ్యవస్థ. నిజానికి ఈ వ్యవస్థ పల్లెల్లో జనాలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఫించన్ల పంపిణీ దగ్గర నుంచి పధకాల అమలుకు జనాలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా వుంది. కానీ ఈ వ్యవస్థ మీద ఇప్పుడు బురద జల్లుడు ప్రారంభమైంది.

అసలు ఈ వ్యవస్థ అంతా అస్తవ్యస్తమని, అందులో వున్నవారంతా వైకాపా కార్యక్తరలే అని, వాళ్లే ఓట్లు వేయించేస్తారని కథనం వండేసారు. సరే ఆ కథనం అంతా ఎలా వున్నా, ఒకటి మాత్రం తెలుగుదేశం పార్టీ, దాని అనుకుల మీడియా డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. వలంటీర్ వ్యవస్థ అంతా వైకాపా కార్యక్తరలతో నిండిపోయింది అన్నదే వారి ఉద్దేశంలా కనిపిస్తోంది.

మరి భవిష్యత్ లో తాము అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తాం అని తెలుగుదేశం పార్టీ ప్రకటించవచ్చు కదా. ఎందుకంటే ఆ వ్యవస్థ సరికాదు అంటున్నారు. దాన్నిండా వైకాపా జనాలే వున్నారు అంటున్నారు. కోర్టు కూడా అభ్యంతరాలు చెప్పింది అని రాస్తున్నారు. అలాంటపుడు ముందే ప్రకటించవచ్చు కదా.

ఇలా బాహాటంగా చెప్పకపోయినా జరిగేది అదే అని అర్థం అవుతోంది. తెలుగుదేశం కనుక అధికారంలోకి వస్తే ఒక్క కలం పోటుతో వలంటీర్ వ్యవస్థను రద్దు చేసి, దానికి బదులుగా మరో మంచి వ్యవస్థ తెస్తామని చెప్పడం పక్కా అనిపిస్తోంది.