ఆమె ఒక్కరు చాలు!

ఆమెకు వైసీపీ నుంచే కాదు, రాజకీయాలను పక్కన పెట్టి కూటమి పార్టీలు కూడా బాగా రాణిస్తున్నారు అని కితాబు ఇస్తున్నారు.

వైసీపీ ఎన్నడూ లేని ఇబ్బందిలో ఉంది. అంతా చీకటి కాలమే. వనవాసమే. ఎటు చూసినా కష్టాలూ, కడగండ్లే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అయిదేళ్ల పాటు అధికారం అనుభవించిన వారంతా అధిక శాతం సైడ్ అయి, సైలెంట్ అయ్యారు. ఇలా కాని కాలం దాపురించిన క్రమంలో “నేను ఉన్నాను” అని ఆమె బలంగా నిలబడ్డారు. ఆమె ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన వరుదు కళ్యాణి. ఆమె తన వాగ్ధాటితో కూటమి ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నారు.

శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో కళ్యాణి ప్రసంగం అదుర్స్ అని వైసీపీ అభిమాన లోకం అంతా సోషల్ మీడియా వేదికగా వేయి నోళ్ళ పొగుడుతోంది. ఆమె ఒక్కరు చాలు, అవతల వైపు ఎంత మంది ఉన్నా ధీటుగా జవాబు చెబుతున్నారు. ఆమె తొణకడం లేదు, బెణకడం లేదు. మండలిలో ఆమె ఇచ్చే స్పీచ్ తో మంటలు రేగుతున్నాయి. అధికార పక్షం నుంచి గట్టిగా డిఫెన్స్ చేసుకోవాల్సి వస్తోంది.

ఇలా వైసీపీలో ఆమె సూపర్ విమెన్ గా ఇప్పుడు పేరు తెచ్చుకున్నారు. ఆమె నిన్నటిదాకా సొంత పార్టీలోనే, సొంత జిల్లాలోనే తక్కువ మందికే పరిచయం. కానీ ఇప్పుడు ఆమె మండలిలో విపక్షం తరఫున వినిపిస్తున్న బలమైన వాణితో మొత్తం ఏపీ పాలిటిక్స్ లోనే టాక్ ఆఫ్ ది విమెన్ అయిపోయారు అని అంటున్నారు.

ఆమెకు వైసీపీ నుంచే కాదు, రాజకీయాలను పక్కన పెట్టి కూటమి పార్టీలు కూడా బాగా రాణిస్తున్నారు అని కితాబు ఇస్తున్నారు. అంటే వరుదు కళ్యాణికి మంచి భవిష్యత్తు ఉందనే అంటున్నారు. ఇలాంటి వారు వైసీపీకి ఈ కష్టకాలంలో తోడుంటే చాలు, మా జగనన్న మళ్లీ సీఎం అవడం ఖాయమని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటున్నారు. రేపటి వైసీపీ ప్రభుత్వంలో ఆమెకు మంత్రి పదవిని కూడా ఖాయం చేసేస్తున్నారు.

34 Replies to “ఆమె ఒక్కరు చాలు!”

  1. రేపటి వైసీపీ ప్రభుత్వం లో ఆవిడకి మంత్రి పదవి కూడా ఇచ్చేశారా..?

    అంటే.. ఈవిడ రాజకీయ భవిష్యత్తు ఎత్తిపోయినట్టే..

    సాక్షాత్తు జగన్ రెడ్డే 2019 ఎన్నికల ప్రచారం లో సుమారు 20 మందికి మంత్రి పదవులిస్తానని మాటిచ్చాడు.. ఒక్కడికి కూడా ఇవ్వలేదు.. పైగా వాళ్ళందరూ ఇప్పుడు అతీ గతీ లేరు..

    ..

    వైసీపీ లో విషయం ఉన్నవాళ్లకు విలువ ఉండదు..

    విలువలు లేనివాళ్లకే పదవులుంటాయి..

    అంబటి రాంబాబు, కొడాలి నాని, అనిల్ యాదవ్, రోజా … ఇలా బొచ్చెడు ఉదాహరణలు చెప్పగలను..

    1. G v reddi vsihayam lo టీడీపీ చేసింది ఏమి బాగో లేదు కష్ట కాలం లో పార్టీ కు తోడు గా ఉన్నాడు. ఈ రోజు అధికారం వచ్చాకా ఇలా చేస్తున్నారు

      1. అవును.. కానీ జీవీ రెడ్డి మేటర్ ఫిక్స్ అవుతుంది..

        ఇప్పుడు రెండు వైపులా కొంత దూరం పెరిగింది.. కానీ నెక్స్ట్ వన్ ఇయర్ లో అంతా సర్దుకుంటుంది..

        జీవీ మళ్ళీ టీడీపీ లోకి వస్తారు..

  2. ఏస్ ప్రశ్నించే ప్రజాస్వామ్యం ఉండాలి ఆమె ను నేను చూసాను ఎలాంటి ప్రతి పక్ష నేత హోదా కాకుండా ఆమె పని ఆమె చేస్తున్నారు. ప్రతిపక్షం అనేది ఉండాలి ఎప్పుడయినా అప్పుడే నిజమయిన ప్రజా స్వామ్యం నేను టీడీపీ కూటమి కి వోట్ వేసిన ఈమె ను మెచ్చుకుంట .రోజా లాంటి గబ్బు నోరు ఉండకూడదు

    1. ఆమె కు వున్న ధైర్యం ధీరులు శూరులు అని ప్రగల్భాలు పలికిన వాళ్లకు కనీసం 1 పర్సంట్ కూడా లేదు

  3. పాపం నీ పరిస్తితి ఇలా తయ్యారు అయిందా!!!!….రేపు anchor శ్యామల, లక్ష్మి పార్వతి ని ఎలేవేటే చేస్తావ్

  4. ఓరి ని అలా ఫీల అవుతున్నావా? నెక్స్ట్ ఇయర్ లోపల ఏ పార్టీ లో ఉంటున్నదో అమకే తెలుదు.

  5. గతం lo ఇలా ఎలివేషన్ ఇచ్చినోళ్లు అందరు ఇప్పుడు ఎలా ఉన్నారు… ఆవిడ ఫ్యూచర్ చాలా క్లియర్ గా కనపడుతుంది..

  6. ప్రజల తీర్పు మరియు జగన్ మోహన్ రెడ్డి యొక్క ప్రస్తుత స్థితి

    ప్రజలు ఇచ్చిన తీర్పు అనేది చాలా స్పష్టమైన సంకేతాన్ని ఇస్తుంది. జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష నేతగా కూడా లేరు. ఆయన సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవల కోసం ఉన్నానని చెప్పిన ఆయన, ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేగా తమ స్థానం మరింత పటిష్టం చేసుకోవాలంటే, ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందడం చాలా అవసరం.

    మీరు ఒక ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవ చేయాలని ఎప్పటికప్పుడు చెబుతున్నారు. పేద ప్రజలను ఆదుకుంటున్నామని, వారి కోసం అన్నీ చేస్తున్నామన్న ఒక మార్గాన్ని తీసుకున్నామని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ప్రజలు గమనించేది మీ మాటలు కాదు, మీ చర్యలు. మీరు చెబుతున్న మాటలతో మీ చర్యలు సరిపోలకపోతే, ఆ మాటల మీద ఎవరూ నమ్మకం ఉంచరు.

    మీ తల్లి, చెల్లి… వీరు మీ కుటుంబంలోని అత్యంత దగ్గర వ్యక్తులు. కుటుంబానికి ఆపన్న హస్తం ఇచ్చి, బతుకులో మార్గదర్శకత్వం అందించిన వారు. వారు కోర్టు మెట్లు ఎక్కే స్థాయికి తీసుకువెళ్లడం, తమకు న్యాయం కోసం బహిరంగంగా మీపై విమర్శలు చేయాల్సిన పరిస్థితి రావడం చాలా పెద్ద సమస్య. ఈ పరిస్థితి మీరు ప్రజలకు చెప్పే “పేదల సంక్షేమం” మాటలతో ఎంత సంబంధం ఉంది? మీ తల్లి, చెల్లిని సరిగా చూసుకోలేకపోతే, మీరు పేద ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచిస్తున్నారా అని ప్రజలు ప్రశ్నించరు?

    ఒక సూటి ఉదాహరణ:

    ఒక రైతు తన వ్యవసాయ భూమిని కాపాడుకోవడానికి ప్రతిరోజు కష్టపడతాడు. కుటుంబానికి అన్నం పెట్టే రైతు అదే భూమిని, అదే వృత్తిని పట్టించుకోకుండా, తన పొలం పక్కన ఉన్న పేద రైతుకు నీళ్లను ఇస్తున్నానని చెప్పుకుంటే ఎవరైనా నమ్ముతారా? తన కుటుంబాన్ని పట్టించుకోకుండా, ఇతరులకు సహాయం చేస్తున్నానని చెప్పడం ఎంతవరకు సబబు? ప్రజలు ఈ విభిన్నతను గమనిస్తారు, ఆ రైతు మాటలపై నమ్మకం ఉంచరు. మీరు చేస్తున్నది కూడా అంతే. మీ కుటుంబాన్ని పట్టించుకోకుండా, పేదల కోసం చేస్తున్నామని చెప్పినప్పుడు, మీ మాటల మీద ప్రజలు నమ్మకం ఎలా పెడతారు?

    మీ తల్లి, చెల్లితో ఒకే ఫ్రేమ్‌లో దిగిన ఫోటో పోస్టు చేయడం కంటే, వారికి ఆచరణాత్మకంగా గౌరవం ఇవ్వడం ముఖ్యం. తల్లి, చెల్లిని గౌరవించడం ఒక కుటుంబ బాధ్యత మాత్రమే కాదు, మీరు ప్రజల ముందే నిజాయతీతో ఉన్నట్లు చూపించగలిగే చర్య. మీరు మీ కుటుంబానికి కూడా న్యాయం చేయలేకపోతే, ప్రజల ప్రయోజనాలను ఎలా నిలబెట్టగలరు?

    ప్రజలకు నిజాయతీ చూపించండి.

    మీ పేదలకు చేయాల్సిన సేవలను సాకారం చేయడం ముందు, మీ కుటుంబానికి గౌరవం ఇచ్చే పనిలో ముందుండండి. తల్లి, చెల్లిని గౌరవించకుండా, మీ నాయకత్వంపై ప్రజలు ఎలా నమ్మకం పెడతారు? పేదలను ఆదుకోవాలంటే ముందుగా కుటుంబానికి న్యాయం చేయండి. మరీ ముఖ్యంగా, పేదలను ఆదుకుంటున్నామన్న మాటకు నమ్మకాన్ని తెచ్చేది మీ మాటలు కాదు, మీ చర్యలు.

    అందుకే, మీ తల్లి, చెల్లిని గౌరవించండి. డబ్బు కోసమే ఈ వ్యవహారమని ప్రజలు భావించకుండా, నిజాయతీతో ముందుకు రండి. అప్పుడే ప్రజలు మీ మాటలను విశ్వసిస్తారు.

    1. మన వారికి అవేమీ అక్కర్లేదు

      కులం మతం ఉంటే చాలు

      60%వాటి పిచ్చిలోనే ఉన్నారు

  7. అసలు నీవు ఏమి వ్రాస్తున్నావో నీకు తెలుస్తుందా, ఒక స్త్రీ చేస్తున్న పని నీ అభిమాన లీడర్ జగన్ అసెంబ్లీకి వచ్చి ఎందుకు చేయడు. నాకు గంటల, గంటల టైమ్ ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటున్నాడు, మరి ఆవిడ ఇచ్చిన టైమ్ లోనే తను చెప్పదల్చుకుంది క్లారిటీగా చెబుతుందిగా

    1. నీకే కాదు మీ పచ్చ బ్యాచ్ మొత్తానికి అజ్ఞానం ఉంది అని అర్దం అయింది….

      ఆమె మాట్లాడేది ఎక్కడ?

      జగన్ కు ప్రతిపక్షం ఇవ్వకపోతే ప్రశ్నించడానికి సమయం ఇవ్వరు…

      ఒకవేళ ఇచ్చినా తక్కువ సమయం ఇస్తారు (ఒక MLA కు ఎంత సమయమో అంతే)

      ఆ ప్రశ్నకు జవాబు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏమి కాదు…మరియు వివరణ ఇవ్వకపోయినా అడిగే హక్కు ఉండదు…

      అనే జ్ఞానం లేని మీకు ఈ ప్రశ్న వేసే హక్కు కూడా లేదు

      కాబట్టి గట్టిగా చేతులు కట్టుకొని కూర్చో…

  8. Tondaralone avidaki moodutundi ….. systematic ga policies only policies matladithe maa boss ki nachadu …. posani, roja, Kodali, vallabhaneni, borugadda type ithe….. ok…..

Comments are closed.