ఉత్తరాంధ్రా ఉసురు తగులుతుంది బాబూ

ఉత్తరాంధ్రా అంటే ఉత్త అమాయకం అని టీడీపీ భావన. అందుకే రాజధాని వేరే చోట పెట్టి సదస్సులు సమావేశాలూ అన్నీ విశాఖ వేదికగా జరపడంలోనే ఆయన రాజకీయ చాణక్యం అర్ధమవుతుంది అని ప్రత్యర్ధులు అంటారు.…

ఉత్తరాంధ్రా అంటే ఉత్త అమాయకం అని టీడీపీ భావన. అందుకే రాజధాని వేరే చోట పెట్టి సదస్సులు సమావేశాలూ అన్నీ విశాఖ వేదికగా జరపడంలోనే ఆయన రాజకీయ చాణక్యం అర్ధమవుతుంది అని ప్రత్యర్ధులు అంటారు. విశాఖను చూపించి పెట్టుబడుల సదస్సులు పెట్టిన బాబు కంపెనీలు మాత్రం అమరావతిలో పెట్టమని కోరారని మంత్రి గుడివాడ అమరానాధ్ ఘాటైన కామెంట్స్ గతంలో చేశారు.

ఇపుడు వైసీపీ ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి అయితే ఉత్తరాంధ్రా ఉసురు మీకు తగులుతుంది చంద్రబాబు గారూ అంటూ శాపనార్ధాలే పెట్టారు. అమాయకమైన ఉత్తరాంధ్రాను వంచించడానికేలా మనసు వచ్చిందని ఆమె నిలదీశారు. అమరావతి రైతుల పాదయాత్ర వెనక ఉన్నది చంద్రబాబే అని ఆరోపించారు. ఏపీలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ చిచ్చు రాజేస్తున్నారు అని మండిపడ్డారు.

మొత్తం రాష్ట్రం ఆదాయం ఒక్క అమరావతిలోనే పెడితే మిగిలిన ప్రాంతాల సంగతేంటి అని ఆమె ప్రశ్నించారు. అందుకే తాము రైతుల పాదయాత్రను ఉత్తరాంధ్ర మీద దండయాత్ర అని అంటున్నామని ఆమె పేర్కొన్నారు. విశాఖను రాజధానిగా చేస్తే ఉత్తరాంధ్రా అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు.

జగన్ ది 26 జిల్లాల అభివృద్ధి విజన్ అయితే చంద్రబాబుది కేవలం 29 గ్రామాల విజన్ అని ఆమె విమర్శించారు. నిజానికి అమరావతి ప్రజల మీద కూడా బాబుకు ప్రేమలేదని, రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద మాత్రమే అసలైన మమకారం అని వరుడు కళ్యాణి ఘాటుగానే విమర్శించారు. ఉత్తరాంధ్రలో అత్యధిక పేదరికం తో వలసలు కొనసాగుతున్నాయని ఇవి బాబు కళ్ళకు కనిపించవా అంటూ ఆమె ఫైర్ అయ్యారు.

ఏపీలో అతి తక్కువ వ్యయంతో రెడీ మేడ్ గా రూపొందే రాజధాని విశాఖ మాత్రమే అని ఆమె అన్నారు. ఇదే విషయం శ్రీక్రిష్ణా కమిటీ కూడా చెప్పిందని ఆమె గుర్తు చేశారు. విశాఖను రాజధానిగా ప్రజలు కోరుకుంటున్నారని ఎవరెని పొర్లు దండాలు పెట్టినా వృధా యాత్రలు చేసినా విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఖాయమని వైసీపీ ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి పక్కా క్లారిటీగా చెప్పేశారు.