నాడు ప్రత్యర్ధులే నేడు బిజినెస్‌ పార్టనర్స్‌

మూడు పువ్వులు ఆరు కాయలుగా ఇద్దరూ రాజకీయాలూ వ్యాపారాలు చేసుకుంటూ అన్నదమ్ముల మించిన ఆత్మీయతతో ఉంటున్నారని అంటున్నారు.

వారిద్దరి మధ్యన రెండు సార్లు ఎన్నికల సమరం సాగింది. విశాఖ తూర్పు నుంచి టీడీపీ తరఫున వెలగపూడి రామకృష్ణబాబు 2009లో పోటీ చేస్తే ప్రజారాజ్యం నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్‌ పోటీ పడి ఓటమి పాలు అయ్యారు. 2014లోనూ ఈ ఇద్దరే పోటీ చేశారు. అయితే వంశీకృష్ణ ఆనాడు వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి చూశారు. ఈ రెండు సందర్బాలలోనూ ఈ నేతలు మాటలతో విమర్శలు చేసుకున్నారు.

2019 నాటికి మాత్రం వంశీకి టిక్కెట్‌ రాకపోవడంతో పరోక్షంగా టీడీపీకి సహకరించారు అన్న పుకార్లు వినిపించాయి. 2024లో చూస్తే ఈ ఇద్దరూ కూటమిలో మిత్రులు అయిపోయారు.

విశాఖ దక్షిణం నుంచి జనసేన తరఫున వంశీకృష్ణ పోటీ చేసి గెలిచారు. వెలగపూడి యథాప్రకారం తన తూర్పు నియోజకవర్గం నుంచి నాలుగవసారి గెలిచారు. చిత్రమేంటి అంటే ఒకనాడు ఉప్పు నిప్పుగా ఉన్న ఈ నాయకులు ఇద్దరూ ఇపుడు మంచి మిత్రులు అయ్యారు.

లిక్కర్‌ వ్యాపారంలో వెలగపూడి మొదటి నుంచి దిట్టగా పేరు పొందారు. ఇప్పుడు ఆయనతో కలసి వంశీకృష్ణ ఈ బిజినెస్‌లో పార్టనర్‌ అయ్యారని చెప్పుకుంటున్నారు. మూడు పువ్వులు ఆరు కాయలుగా ఇద్దరూ రాజకీయాలూ వ్యాపారాలు చేసుకుంటూ అన్నదమ్ముల మించిన ఆత్మీయతతో ఉంటున్నారని అంటున్నారు. గతం నుంచి ఈ ఇద్దరినీ చూస్తున్న వారు మాత్రం ఔరా ఇదేమి విడ్డూరమని ముక్కున వేలు వేసుకుంటున్నారు.

4 Replies to “నాడు ప్రత్యర్ధులే నేడు బిజినెస్‌ పార్టనర్స్‌”

  1. కలిసి ఉంటె కలదు సుఖం..

    సింగల్ సింహాలం అంటూ అందరినీ భూతులు తిడుతూ రచ్చ చేస్తే.. బొచ్చు ఊడును ..కాళ్ళు విరుగును..

    అందగాళ్ళు అంద విహీనంగా.. కురూపిగా మారును..

Comments are closed.