తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ అధినేత చంద్రబాబు తన అనుచరులతో సృష్టించిన వీరంగంపై మంత్రి వేణుగోపాల కృష్ణ ఫైర్ అయ్యారు. చంద్రబాబు సైకోలాగా ప్రవర్తిస్తున్నారని నడిరోడ్డుపై సభలు వద్దని, నిబంధనలు పాటించాలన్నందుకు పోలీసులపై టీడీపీ కార్యకర్తలను ఉసిగొలిపి గోడవలు సృష్టిస్తున్నారని మండి పడ్డారు.
నిబంధనలను ఉల్లంఘించిన చంద్రబాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని, చట్టాలను ఎవరైనా గౌరవించాల్సిందేనని.. సీఎంగా పని చేసిన చంద్రబాబు పోలీసుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించడం సిగ్గు చేటు అన్నారు.
రాష్ట్రంలో అశాంతిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మండిపడ్డారు. సైకిల్ రావాలి.. సైకిల్ రావాలి అంటూ సైకోలా మారిపోయాడని, చంద్రబాబు అనే వ్యక్తికి విజనరీ లేదు.. విజన్ లేని వ్యక్తి అంటూ దుయ్యబట్టారు.
తన పబ్లిసిటి కోసం టీవీ షోలకు వెళ్లె చంద్రబాబు నాయుడుకు ఆయన రాష్ట్రంలో పర్యటించినప్పుడు పోలీసులు, వైసీపీ నేతలు దగ్గర ఉండి ఫ్రీ పబ్లిసిటి ఇస్తున్నారంటూన్నారు రాజకీయ విశ్లేషకులు. కాగా నిన్న చంద్రబాబు బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో చంద్రబాబు పోలీసులపై తీవ్ర విమర్శలు చేసింది తెలిసిందే.