ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్ట్ అయి జైల్లో ఉన్న మాజీ సీఎం చంద్రబాబుకు ఇండియా కూటమి సభ్యులు మద్దతు తెలపడంతో టీడీపీ కూడా ఇండియా కూటమిలో భాగమేనని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
'చంద్రబాబుకు ఇండియా కూటమి సభ్యులు మాత్రమే మద్దతు తెలుపుతున్నారు. ఆయన కుమారుడికి ఫోన్ చేస్తున్నారు. దీన్ని బట్టి టీడీపీ.. ఆ కూటమిలో భాగమని నిరూపితమవుతోందని. అధికారంలోకి రావడం, వీలైనంత దోచుకోవడమే వారి ఉమ్మడి వ్యూహం. ఎన్నికల్లో ఒంటరిగా పోరాడే ధైర్యం టీడీపీకి లేదు' అని ట్వీట్ చేశారు.
కాగా చంద్రబాబు అరెస్ట్‌పై ఇప్పటి వరకు తన ద్వారా లబ్ధిపొందిన ఇతర పార్టీ నేతలు, బీజేపీలో బాబు టీం సభ్యులు తప్పా కేంద్ర బీజేపీ పెద్దలు ఎవరు మాట్లాడలేదు. కాకపోతే ఇప్పటికే ఇండియా కూటమి నుండి మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా లాంటి ప్రముఖులు చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు. దీంతో పాటుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న లోకేష్‌తో కూడా ఇండియా కూటమి నాయకులు తప్పా బీజేపీ పెద్దలు ఎవరు మాట్లాడకపోవడంతో టీడీపీ తన పాత మిత్రుడు అయిన కాంగ్రెస్ కూటమిలోకి వెళ్లబోతున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటి ఇండియా కూటమిలాగే గత పార్లమెంట్ ఎన్నికల ముందు చంద్రబాబు నాయకత్వంలో కాంగ్రెస్‌తో కలిసి బీజేపీని ఓడించడం కోసం పెద్ద ఎత్తున్న ప్రచారం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో కూడా టీడీపీ, కాంగ్రెస్ కలిపి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లింది. ఇన్ని రోజులు మోడీ కోసం ప్రార్థనలు చేసిన చంద్రబాబును ఆయన పట్టించకపోవడంతో ఇండియా కూటమిలోకి వెళ్లడానికి బాబు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.