విజయసాయి Vs రఘురామ.. మళ్లీ మాటల యుద్ధం

ఎంపీలు విజయసాయిరెడ్డి, రఘురామ కృష్ణంరాజు మధ్య మాటల యుద్ధం కొత్త కాదు. గతంలోనే వీళ్లిద్దరూ నువ్వెంత అంటే నువ్వెంత అనే రేంజ్ లో విమర్శించుకున్నారు. నీది నీచపు జీవితం అని ఒకరంటే.. నిన్ను రొచ్చులో…

ఎంపీలు విజయసాయిరెడ్డి, రఘురామ కృష్ణంరాజు మధ్య మాటల యుద్ధం కొత్త కాదు. గతంలోనే వీళ్లిద్దరూ నువ్వెంత అంటే నువ్వెంత అనే రేంజ్ లో విమర్శించుకున్నారు. నీది నీచపు జీవితం అని ఒకరంటే.. నిన్ను రొచ్చులో తొక్కుతారు అంటూ మరొకరు తిట్టుకున్నారు. ఇప్పుడీ మాటల యుద్ధం మరో స్థాయికి చేరింది. విజయసాయి డూప్లికేటు రాజు అని విమర్శిస్తే.. రఘురామ నకిలీ రెడ్డి అంటూ తిట్ల పురాణం అందుకున్నారు.

మద్యం పూర్తిగా నిషేధిస్తామని చెప్పి ఇప్పుడు ఆ మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టుగా పెట్టి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 8 వేల కోట్ల రూపాయల రుణం సమీకరించడం అన్యాయం అంటూ ఢిల్లీలో విమర్శలు చేశారు రఘురామ. దీనిపై విజయసాయి ఘాటుగా స్పందించారు. అక్కడ్నుంచి మొదలైంది ఈ మాటల యుద్ధం.

విజయసాయి ట్వీట్: ఢిల్లీలో కూర్చొని జోస్యాలు చెప్పే నర్సాపురం నక్కకి సిగ్గుంటే రాజీనామా చేసి గెలవాలి. నాలుగు పచ్చ కుల ఛానెల్స్ మైకులు ముందు పెట్టుకుని మొరగడం కాదు. నియోజకవర్గంలో తిరిగితే  విగ్గు రాజాకు దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తుంది.

రఘురామ కౌంటర్: హలో రసిక వానరా! అవును నాకు ఉన్నది విగ్గు..ఎన్ని తన్నులు తిన్నా నీకు లేనిది సిగ్గు. కొత్తగా రాజీనామా అంటున్నావు? నువ్వు, నీ గ్యాంగ్ లీడర్ అనర్హత/సస్పెన్షన్ పై చేతులు ఎత్తేసారా? నేను ఏపీ కి వస్తే ముఖ్యమంత్రి కి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవ్వుద్ది అనేగా నా పై కేసులు పెట్టిస్తున్నారు.

విజయసాయి ట్వీట్: అడగకుండానే నియోజకవర్గం వదలి అజ్ఞాతవాసం, అరణ్యవాసం చేసే ఏకైక రాజు….విగ్గురాజు, పెగ్గురాజు!

రఘురామ కౌంటర్: అజ్ఞాతవాసం తరువాత పాండవులకి, అరణ్యవాసం తరువాత శ్రీ రాముడికి జరిగింది పట్టాభిషేకం. చచ్చింది కౌరవులు, దానవులు. తెలుసుకో రా కండోమ్ రెడ్డి!!

విజయసాయి ట్వీట్: ఒరేయ్ డూప్లికేట్ గాజు…నీ మీసాలైనా ఒరిజినలేనా లేక పీకి అంటించుకున్నావా? వాటిని మెలి తిప్పడం ఎందుకురా?

రఘురామ కౌంటర్: ఎవడు ఒరిజినల్ రాజో ఎవడు డూప్లికేట్ రెడ్డో ప్రజలకి ‘ఎరుక’లే రా! మనం కలిసినప్పుడు నా వెంట్రులన్నీ చూపిస్తా..నువ్వే పీకి చూస్కో

ఇలా ఒక రేంజ్ లో ఈ ఇద్దరు ఎంపీలు తిట్టుకున్నారు. గతంలో వీళ్ల మాటల యుద్ధం డైలీ సీరియల్ లా 5 రోజుల పాటు కొనసాగింది. ఈసారి ఇంకెన్ని రోజులు ఈ తిట్ల పురాణాన్ని కొనసాగిస్తారో చూడాలి.