శృంగారం గురించి ఆస్వాధించడం గురించి సృష్టిలో ఏ జీవికీ చెప్పనక్కర్లేదేమో! అత్యంత సహజమైన ఈ ప్రక్రియ గురించి ఎవ్వరికీ కొత్తగా వివరించనక్కర్లేదు. అయితే నాగరికత వల్ల, సమాజంలో కట్టుబాట్లు, సంప్రదాయాలు, చట్టాలు, శతాబ్దాలుగా కొనసాగుతున్న అభిప్రాయాలు.. వీటన్నింటి ఫలితంగా శృంగారంపై చర్చ కూడా మనిషికి అవసరమైనదిగా మారింది.
పెరిగిన వాతావరణం, సహజమైన బిడియం, అపోహలు.. ఇవన్నీ భార్యభర్తలైన వారి మధ్య కూడా శృంగారం విషయంలో పరస్పర అవగాహన లేకపోవచ్చు. ఈ విషయంలో లింగబేధాలు ఉండవు. ఎవ్వరు విన్నది, తెలుసుకున్నది, అనుకుంటున్నదాని ప్రకారం వారు ప్రవర్తించవచ్చు. దీని వల్ల బేధాభిప్రాయాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి సమస్యకు పరిష్కారం ఏమిటంటే.. పార్ట్ నర్ తో ఓపెన్ గా డిస్కస్ చేసుకోవడమే అంటున్నారు రిలేషన్ షిప్ ఎక్స్ పర్ట్స్.
ఇదే సమయంలో శృంగారంలో చేయకూడని పొరపాట్ల గురించి వారు ఒకింత వివరణ ఇస్తున్నారు. అదేమిటంటే..
ఇష్టాయిష్టాలను చెప్పకపోవడం!
శృంగారం విషయంలో పరస్పరం ఇష్టాయిష్టాలను చెప్పకపోవడం అతి పెద్ద పొరపాటు. బహుశా సామాజిక పరిస్థితుల దృష్ట్యా పురుషుడు తన ఇష్టాన్ని చెప్పుకుంటాడేమో కానీ, స్త్రీలు చెప్పుకోలేకపోవచ్చు అది భర్తతో అయినప్పటికీ! ఇలా చెప్పుకోకపోవడమే అతి పెద్ద పొరపాటు అని నిపుణులు చెబుతున్నారు. ఇష్టాయిష్టాల గురించి పరస్పరం చర్చించుకోవడం, ఒకటికి రెండు మూడు సార్లు అయినా ఈ విషయంలో పరస్పరం స్పష్టతను ఇచ్చుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
చొరవ చూపకపోవడం!
ఇది స్త్రీల విషయంలో ఉన్నకంప్లైంట్. బెడ్ రూమ్ యాక్టివిటీ మీద ప్రధానంగా పురుషులే చొరవ చూపాలనే తత్వం ఉండవచ్చు చాలా మంది స్త్రీలలో. ఇదంత తెలివైన అభిప్రాయం కాదు. ప్రతీసారీ తనే చొరవ చూపడం పురుషుడికి కూడా ఒకింత బోర్ కొట్టవచ్చు. స్త్రీ కూడా చొరవ చూపుతూ ఉంటే అది శృంగారంలో మజాను పరస్పరం ఆస్వాధించడానికి చాలా ఉపయుక్తంగా ఉండవచ్చు. స్త్రీ మరీ దద్దిలా ఉండటం పురుషుడికి విసుగు తెప్పించే అంశం కూడా!
అందం గురించి ఎక్కువ ఆలోచించడం!
అందం విషయంలో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. తాము అందంగా ఉండటం, లేకపోవడం విషయంలో కూడా విరుద్ధమైన అభిప్రాయాలు కూడా డ్యామినేట్ చేస్తూ ఉంటాయి. తాము అందంగా లేమనే ఒకింత ఆత్మన్యూనత భావంతో శృంగారం విషయంలో వెనక్కు తగ్గడం, లేదా అందం అంశం ఎక్కువగా డ్యామినేట్ చేస్తూ శృంగారం విషయంలో ఏ భయాన్నో, ఆందోళననో పెంపొందించుకోవడం కూడని పని. శృంగారం కేవలం అందంతో పని కాదు, వైవాహిక బంధంలో అది స్పర్శతో కూడిన బంధం అని గుర్తుంచుకోవాలి.
ఓవర్ థింకింగ్!
శృంగారంలో కరెక్టుగా చేస్తున్నామా లేదా.. అనే ఓవర్ థింకింగ్ అంత గొప్పది కాదు. న్యాచురల్ గా జరిగిపోవడం నేరమేమీ కాదు.
బీస్ట్ లా ఉండొచ్చు!
శృంగారం విషయంలో ఎరోటిక్ గా, బీస్ట్ లా ఉండటం ఏదో పెద్ద తప్పు అనే భావన కూడా పొరపాటే. స్త్రీకి అయినా పురుషుడికి అయినా బీస్ట్ లా రెచ్చిపోవడం సమంజమైన అంశమే. వైల్డ్ గా ఉండటం నొచ్చుకోవాల్సిన అంశం ఏమీ కాదు.