తన అన్న, దివంగత నాయకుడు మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆశయాలను నెరవేరుస్తానని ఆత్మకూరు నూతన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు.
ఇవాళ ఏపీ సచివాలయంలో ఎమ్మెల్యేగా విక్రమ్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన్ను మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి తదితరులు అభినందించారు.
ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరులో అభివృద్ధిలో అన్న గౌతమ్‌రెడ్డి చెరగని ముద్ర వేశారన్నారు. అభివృద్ధే ఆశయంగా పని చేసిన గౌతమ్‌ను స్ఫూర్తిగా తీసుకుని నడుచుకుంటానన్నారు.
తనను భారీ మెజార్టీతో అసెంబ్లీకి పంపిన ఆత్మకూరు ప్రజలకు సర్వదా కృతజ్ఞుడినై వుంటానన్నారు. ఆత్మకూరులో పెండింగ్ పనులపై దృష్టి సారిస్తానన్నారు.
మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతితో ఆత్మకూరుకు ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన , కాంగ్రెస్ పార్టీలు పోటీ చేయలేదు. బీజేపీలో బరిలో నిలిచింది.
బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌పై వైసీపీ అభ్యర్థి విక్రమ్‌రెడ్డి 82,888 ఓట్ల తేడాతో భారీ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయాడు. ఎమ్మెల్యేగా కొత్త ప్రయాణం మొదలు పెట్టిన విక్రమ్‌రెడ్డికి శుభాకాంక్షలు.