పల్లెలకు వికేంద్రీకరణ వాహనాలు

ఉత్తరాంధ్రా జిల్లాలలో వికేంద్రీకరణకు మద్దతుగా జేయేసీ ఆద్వర్యంగా ప్రచార రధాలను రంగంలోకి దించారు. ఈ వాహనాలు గ్రామాలలో తిరుగుతూ విశాఖ రాజధాని ఆవశ్యకతను చాటి చెబుతాయి. ఈ వాహనాల ద్వారా మేధావులు, విద్యావేత్తలు పల్లెలకు…

ఉత్తరాంధ్రా జిల్లాలలో వికేంద్రీకరణకు మద్దతుగా జేయేసీ ఆద్వర్యంగా ప్రచార రధాలను రంగంలోకి దించారు. ఈ వాహనాలు గ్రామాలలో తిరుగుతూ విశాఖ రాజధాని ఆవశ్యకతను చాటి చెబుతాయి. ఈ వాహనాల ద్వారా మేధావులు, విద్యావేత్తలు పల్లెలకు వెళ్ళి రాజధాని విశాఖకు రావాల్సిన ఆవశ్యకతను చాటి చెబుతారు.

ఈ వాహనాలను విశాఖ వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి తాజాగా ప్రారంభించారు. వికేంద్రీకరణ మంత్రంతోనే వైసీపీ ముందుకు సాగుతుందని, అన్ని ప్రాంతాల సమానాభివృద్ధికి తాము ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. తప్పనిసరిగా విశాఖకు రాజధాని వచ్చి తీరుతుందని ఆయన చెప్పడం విశేషం.

వికేంద్రీకరణకు మద్దతుగా ఒక వైపు రౌండ్ టేబిల్ సమావేశాలు జరుగుతున్నాయి. సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో ప్రజా చైతన్యం కోసం అవగాహన కోసం వాహనాలను రంగంలోకి దించారు. దీని ద్వారా మరింతగా ప్రజలలోకి రాజధాని ఆకాంక్ష, ఆవశ్యకత చొచ్చుకుపోయేలా చేయాలన్నది జేయేసీ వినూత్న ఆలోచన. 

తొందరలోనే అమరావతి రైతుల పాదయాత్ర విశాఖ వైపుగా వస్తుందన్న నేపధ్యంలో జేయేసీ ప్రచారా యాత్ర మరింత ఊపు అందుకుంది అని చెప్పాలి.