టాలీవుడ్ స్టార్ కమెడియన్, నటుడు, వైసీపీ నేత అలీకి ఎట్టకేలకు ఆంధ్రప్రధేశ్ ప్రభుత్వ సలహాదారు పదవి దక్కింది. తాజాగా అలీ ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో అలీ రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.
గత ఎన్నికల ముందు తన అప్తమిత్రుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కాదని వైసీపీలోకి చేరినా అలీ గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరుపున ప్రచారం చేశారు. ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడుగా కాబోతున్నరంటూ కొన్నాళ్లు.. వక్ప్ బోర్టు ఛైర్మన్ పదవి అని కొన్నాళ్లు ప్రచారం చేసిన చివరికి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి వరించింది.
అలీ గతంలో తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా ఉండి పార్టీ తరుపున ఎన్నికల ప్రచారం చేసినా టీడీపీ నుండి ఎటువంటి పదవులు దక్కలేదు. ఇప్పటికే పలువురు సలహాదారులు ఉన్న జగన్ ప్రభుత్వంలో అలీ వచ్చి చేరారు.