విశాఖ తూర్పు కాపు కాస్తుందా?

విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు ఔత్సాహికులు రంగంలోకి వస్తున్నారు. విశాఖ నుంచి స్వచ్చంద సేవకురాలు అయిన ప్రియాంకా దండి కాంగ్రెస్ లో ఇటీవల చేరారు. ఆమె తూర్పు సీటుని ఆశిస్తున్నారు. Advertisement…

విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు ఔత్సాహికులు రంగంలోకి వస్తున్నారు. విశాఖ నుంచి స్వచ్చంద సేవకురాలు అయిన ప్రియాంకా దండి కాంగ్రెస్ లో ఇటీవల చేరారు. ఆమె తూర్పు సీటుని ఆశిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని ఆమె ప్రజలను కోరుతున్నారు. విశాఖ తూర్పు నుంచి ఇప్పటికి మూడు సార్లు టీడీపీ గెలిచింది. వెలగపూడి రామక్రిష్ణబాబు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనను ఓడించడం వైసీపీకి టార్గెట్ గా ఉంది.

అందుకే విశాఖ ఎంపీని అదే సామాజిక వర్గానికి చెందిన ఎంవీవీ సత్యనారాయణను బరిలోకి దించారు. ఈ ఇద్దరు మధ్యన పోరు 2024 ఎన్నికల్లో సాగనుంది. చూడబోతే ఈ సీటు బీసీల ఖిల్లా. ఇక్కడ నూటికి తొంబై శాతం బీసీలు ఉంటారు. అక్కడ కాపులు కూడా బాగానే ఉంటారు.

దాంతో కాంగ్రెస్ కాపు కార్డుని ఈ నియోజకవర్గంలో ఉపయోగించేలా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో బీసీల ఓట్లతో పాటు కాపు ఓట్లు కూడా అభ్యర్థుల జయాపజయాలను నిర్ణయిస్తాయి. కాంగ్రెస్ సామాజిక సమీకరణలో భాగంగా ఈ సీటుని బలమైన సామాజిక వర్గానికి ఇవ్వాలని చూస్తోంది.

అయితే రాజకీయాలకు కొత్త అయిన ప్రియాంకా దండీ ఏ మేరకు ఈ నియోజకవర్గంలో తన ప్రభావం చూపిస్తారో చూడాలి. తూర్పు నియోజకవర్గం టఫ్ సీటు అని అంతా అనుకుంటున్నదే. ఇక్కడ కొత్త వారికి ప్రయోగశాలగా ఎంతమేర తూర్పు ఉపయోగపడుతుంది అన్నది చూడాలి. కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఎన్నికల్లో అభ్యర్ధులుగా ఔత్సాహికులే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. అయితే ఎన్నికల వేళకు ప్రధాన పార్టీల నుంచి వచ్చే వారిని తీసుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది.