పారిశ్రామిక దిగ్గజాలంతా ఒకే వేదిక మీదకు

పారిశ్రామిక దిగ్గజాలు అంతా కలసి ఒక్క చోట చేరనున్నారు. వారందరినీ అలా కలిపే అతి పెద్ద ఈవెంట్ గా విశాఖ లోని  గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఉండబోతోంది. పారిశ్రామికంగా దేశంలో చాలా రాష్ట్రాలు ముందంజలో…

పారిశ్రామిక దిగ్గజాలు అంతా కలసి ఒక్క చోట చేరనున్నారు. వారందరినీ అలా కలిపే అతి పెద్ద ఈవెంట్ గా విశాఖ లోని  గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఉండబోతోంది. పారిశ్రామికంగా దేశంలో చాలా రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. ఉమ్మడి ఏపీ కూడా అగ్ర భాగాన ఉండేది.

విభజన తరువాత ఏపీ కొంత ఇబ్బంది పడింది. కానీ ఇపుడు బడా పారిశ్రామికవేత్తలు కంపెనీల చూపును ఏపీ వైపు తిప్పడంతో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తోంది. గత కొన్ని నెలలుగా అదే పని మీద ఉన్న మంత్రులు అధికారులు ప్రభుత్వం అంతా కలసి చేసిన బృహత్ ప్రయత్నానికి దేశంలోని దిగ్గజ పారిశ్రామికవేత్తలు అంతా కదలి రానున్నారు.

సిటీ ఆఫ్ డెస్టినీగా పేరు గడించిన విశాఖ వారికి ఆతీధ్యం ఇవ్వబోతోంది. రెండు రోజుల పాటు విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సు దేశీయ విదేశీయ కంపెనీలు పెద్ద సంస్థలు, పారిశ్రామికవేత్తలకు ఏపీ పొటెన్షియాలిటీ ఏంటో చాటి చెప్పబోతోంది.

ఏపీలో ఉన్న వనరులు, ఏపీ శక్తిసామర్ధ్యాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు కల్పిస్తున్న అవకాశాలు ఏపీ పారిశ్రామిక ప్రగతి, ఇప్పటిదాక జరిగిన దాని మీద ప్రొగ్రెస్ ఇవన్నీ విశాఖ వేదిక మీద ఉంచబోతున్నారు. లోతుగా చర్చించబోతున్నారు. ఏపీ విభజించాక ఇంత లోతైన విశ్లేషణ ఏపీ గురించిన సంపూర్ణమైన చర్చ ఈ తొమ్మిదేళ్ళ కాలంలో జరిగి ఉండదని అధికార వర్గాలు అంటున్నాయి.

పారిశ్రామిక ప్రగతిని కోరుకునే ఫ్రెండ్లీ ప్రభుత్వం ఇపుడు అధికారంలో ఉందన్న దాన్ని వైసీపీ ప్రభుత్వం చెప్పబోతోంది. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో అద్భుతంగా జరుతున్న గ్లోబల్ ఇన్వెస్టెమెంట్ సమ్మిట్ ఏర్పాట్లు క్లైమాక్స్ కి చేరుకున్నాయి. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.

విశాఖ వేదికగా జరిగే ఈ భారీ ఈవెంట్ కి అగ్రశ్రేణి పారిశ్రామిక వేత్తలు పదుల సంఖ్యలో అటెండ్ కాబోతున్నారు అన్నది అందుతున్న సమాచారం. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కేఎం  బిర్లా, సజ్జన్ జిందాల్, సంజీవ్ బజాజ్, అర్జున్ ఒబెరాయ్ సహా పలువురు దిగ్గజ పారిశ్రామిక వేత్తలు హాజరుకానున్నారని తెలుస్తోంది.

ఈ సమ్మిట్ కి కేంద్ర మంత్రులు హాజరవుతున్నారు. దేశంలో పారిశ్రామిక రంగం అభివృద్ధిలో ఏపీ నిర్వహిస్తున్న పాత్ర గురించి వారు చెప్పబోతున్నారు. దేశీయ టెక్, డేటా రంగాల అభివృద్ధిలో ఏపీ నిర్వహిస్తున్న  పాత్ర గురించి ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడనున్నారు. 

తొమ్మిది వేల కిలోమీటర్ల పడవైన తీర ప్రాంతం కలిగి ఉన్న ఏపీలో సముద్ర వాణిజ్యం చాలా కీలక భూమిక పోషిస్తోంది. ఆ రంగంలో  రాష్ట్రానికి ఉన్న అపార అవకాశాలపైన రాష్ట్ర కేంద్ర మంత్రులు పెట్టుబడిదారులకు వివరిస్తారు. నభూతో నభవిష్యత్తు అన్న తీరున ఈ గ్లోబల్ సమ్మిట్ ని నిర్వహిచనున్నట్లుగా మంత్రులు గుడివాడ అమరనాధ్, బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి చెబుతున్నారు