మాకొద్దీ రాజధాని అంటూ…!

విశాఖకు రాజధానిని ఇస్తామని అన్నా ప్రజలు కరుణించలేదు. మాకొద్దీ రాజధాని అంటూ వైసీపీకి చేదు మిగిల్చారు.  విశాఖలో ప్రమాణం అని జగన్ స్వయంగా చెప్పారు.  జూన్ 9న ముహూర్తం కూడా నిర్ణయించారు. విశాఖ నుంచి…

విశాఖకు రాజధానిని ఇస్తామని అన్నా ప్రజలు కరుణించలేదు. మాకొద్దీ రాజధాని అంటూ వైసీపీకి చేదు మిగిల్చారు.  విశాఖలో ప్రమాణం అని జగన్ స్వయంగా చెప్పారు.  జూన్ 9న ముహూర్తం కూడా నిర్ణయించారు. విశాఖ నుంచి పాలించాలని రుషికొండ వద్ద ఉన్న టూరిజం భవనాలను పూర్తిగా కూల్చి అతి పెద్ద భవనాలను పునర్నిర్మించారు.

అత్యంత విలాసంగా వాటిని డిజైన్ చేశారు. హెలిపాడ్ అక్కడే దిగేలా కూడా నిర్మాణం చేశారు. ఇంత చేసినా రుషికొండ పాలెస్ లోకి ప్రవేశించడానికి ఎన్నో ముహూర్తాలు పెట్టుకున్నా జగన్ మాత్రం అక్కడ అడుగు పెట్టలేకపోయారు.

అలా జగన్ కలగా నిర్మించుకున్న రుషికొండ ప్యాలెస్ లోకి అడుగు పెట్టకుండానే జగన్ మాజీ సీఎం అయిపోయారు. రెండోమారు గెలిస్తే ఈ నెల 9న ప్రమాణం చేసిన తరువాత రుషికొండ భవనాలలోనే క్యాంప్ ఆఫీస్ పెట్టి పాలన చేయాలని జగన్ ఆలోచించారని అంటారు.

విశాఖలో చూస్తే అన్ని సీట్లనూ కూటమి అభ్యర్ధులు గెలుచుకున్నారు. వైసీపీకి దక్కినవి ఏజెన్సీలో రెండు సీట్లు మాత్రమే. అంతకు మించి ఏ ఒక్క సీటూ జనాలు ఇవ్వలేదు. గత ఎన్నికల తీర్పుని జనాలు రివర్స్ లో ఇచ్చారు. దాంతో వైసీపీకి ఇది అత్యంత అవమానమైన ఓటమిగా పేర్కొంటున్నారు.