స్టీల్ ప్లాంట్ మీద లోకేష్ లేటెస్ట్ మాట

విశాఖ వచ్చారు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. విశాఖలో గత కొద్ది నెలలుగా పెద్ద ఎత్తున సాగుతున్న ఉక్కు ఉద్యమం మీద మీడియా ప్రశ్నలను ఆయన ఫేస్ చేశారు. విశాఖ ఉక్కు మీద…

విశాఖ వచ్చారు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. విశాఖలో గత కొద్ది నెలలుగా పెద్ద ఎత్తున సాగుతున్న ఉక్కు ఉద్యమం మీద మీడియా ప్రశ్నలను ఆయన ఫేస్ చేశారు. విశాఖ ఉక్కు మీద మా స్టాండ్ ఒక్కటే అని లోకేష్ చెప్పారు. చంద్రబాబు కానీ తాను కానీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకమని స్పష్టం చేశారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగనీయబోమని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పాక ఇక ఆందోళన ఎందుకు అన్నట్లుగా లోకేష్ మాట్లాడారు. వైసీపీ దీని మీద రాజకీయం చేస్తోంది అని మండిపడ్డారు. అయిదేళ్ల పాటు వైసీపీ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏమీ చేయలేదని చినబాబు దుమ్మెత్తారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యోచన లేదని ఆయన అంటున్నారు. వైసీపీకి బుద్ధి లేదని కూడా హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు చినబాబు మాటలు విని ఉద్యమం ఆపేయొచ్చా అన్నదే అందరికీ కలుగుతున్న డౌట్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని చెబుతున్నారు. కేంద్రం చూస్తే వేగంగా ఆ ప్రక్రియను పూర్తి చేసేలా ఉందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఇది వైసీపీ టీడీపీల మధ్య రాజకీయ సమరం కాదు, వేలాది మంది కార్మికుల బతుకు సమస్య. ఈ విషయంలో వారికి ధైర్యం కావాలి, భరోసాను ఇవ్వాలి. ఊరటను ఇచ్చే మాట కావాలి. అది కేంద్ర ప్రభుత్వం నుంచి విస్పష్టమైన ప్రకటన ద్వారానే సాధ్యపడుతుంది. ఏపీ ప్రభుత్వం మేము ప్రైవేటీకరణకు వ్యతిరేకం అంటే సరిపోతుందా అని ఉక్కు ఉద్యమకారులు అంటున్నారు.

ఈ విషయంలో అఖిల పక్షాన్ని వేసి ఢిల్లీకి తీసుకుని వెళ్ళి ప్రధానిని కలవాలని ఉద్యమకారులు కోరుతున్నారు. ఆ దిశగా ఏపీ ప్రభుత్వం ఆలోచన చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున పోరాడితేనే కేంద్రం పట్టించుకోవడం లేదని ఏపీ ప్రభుత్వం ఒత్తిడి చేయకపోతే ప్లాంట్ మిగలదని అంటున్నారు. ఈ విషయంలో సీరియస్ యాక్షన్ అవసరం అంటున్నారు.  లోకేష్ మాత్రం వైసీపీ మీద విమర్శలు చేస్తున్నారు.

ఎవరు ఎవరిని విమర్శించుకోకుండా ఇది రాష్ట్ర సంపద అని అందరినీ కలుపుకొని పోయి కేంద్రం తో కీలక ప్రకటన రప్పించేలా చూడాలన్నదే కార్మికుల ఏకైక డిమాండ్.

13 Replies to “స్టీల్ ప్లాంట్ మీద లోకేష్ లేటెస్ట్ మాట”

  1. Meeru ennaina cheppandi. Ginjukoni chavandi. Elections mundu oo veyyi rupayalu penchutamante votlu vese verri janaalunna naa AP. Nuvvu melukovani telisee pilupu ivvatam mysure bajjilo mysure nu vedikinatle.

  2. వాళ్ళ స్టాండ్ ఒక్కటే…నిమ్మకు నీరెత్తడం అంటారే అదే….ఒక్కో విభాగం మూసేస్తుంటే,vrs తీసుకుని ఎవ్వరిదారి వాళ్ళు చూసుకుంటుంటే ప్లాంట్ మూసేసి అమ్మేసుకోవొచ్చు..

  3. Lokesh and CBN as MLAs are against privatization but Kootami wants to privatize steelnplant and both CBN and Lokesh only being 2 does not have enough strength to stop privatization. Nice visionary story!!

  4. నువ్వు నీ తిక్క..స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చెయ్యటం అనేది జరగని పని మనం చేస్తాం అన్నము అంటే మన మీద కేసు లు ఉన్నాయ్ వల్ల మీద ఏమి ఉన్నాయ్

  5. నువ్వు నీ తిక్క..స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చెయ్యటం అనేది జరగని పని మనం చేస్తాం అన్నము అంటే మన మీద కేసు లు ఉన్నాయ్ వల్ల మీద ఏమి ఉన్నాయ్

  6. విశాఖ ప్రజలు కొంచెం ఎర్రి పువ్వులు, లోకేష్ మల్ల కాలీఫ్లవర్ పెడుతున్నాడు. భోగాపురం విమానాశ్రయం వస్తే వైజాగ్‌ని మారుస్తామని చెబుతున్నారు. వైజాగ్‌లో ఐటీ రంగం హైదరాబాద్‌తో సమానంగా 1% కూడా లేదు. ఐటీ వృద్ధి, ఫార్మా, ప్రైవేట్ రంగాల వృద్ధి లేకపోతే భోగాపురం విమానాశ్రయం వల్ల ఉపయోగం ఉండదు. భోగాపురం విమానాశ్రయం ఏర్పాటుకు వైసీపీ పార్టీయే కారణం. వైజాగ్ కోసం టీడీపీ ఏం చేయబోతోంది. ప్రజలు ఎదురు చూస్తున్నారు…మాకు గాలి కబుర్లు వద్దు

Comments are closed.