ఆయన సీనియర్ మోస్ట్ నాయకుడు, మాజీ మంత్రి కూడా. అలాంటి వారి నుంచి సహజంగా ప్రజలు సమస్యలను ప్రస్థావించడాన్ని ఎవరైనా ఆశిస్తారు. కానీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వైసీపీ నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారా అన్న చర్చ తాజాగా వస్తోంది.
ఆయన నిన్నటిని నిన్న వైసీపీ విశాఖ జిల్లా ప్రెసిడెంట్ అవంతి శ్రీనివాసరావు మీద వ్యక్తిగత విమర్శలు చేశారు. మాట్లాడితే ఆడియో టేపులు బయటపెడతామని అంటూ ఏదో చెప్పబోయారు. ఇపుడు మంత్రి అంబటి రాంబాబుని పట్టుకుని కాంబాబు అని అయ్యన్న మాట్లాడుతున్నారు. త్వరలో ఆయన మంత్రి పదవి ఊడుతుంది, బర్తరఫ్ అవుతారు అని జోస్యం చెబుతున్నారు.
నిజంగా అంబటి రాంబాబు టిడీపీ మీద విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు చేయవచ్చు. ఇక మంత్రులకు అనేకమైన ప్రజా సమస్యలు దృష్టికి తేవచ్చు. మరి అయ్యన్నపాత్రుడు మాత్రం డైరెక్ట్ గా వార్నింగులే ఇస్తున్నారు, మీ జాతకాలు బయటపెడతామని అంటున్నారు.
ఇంతకు ముంది మంత్రి ఆర్కే రోజా మీద కూడా అనుచితమైన కామెంట్స్ చేశారు. దానికి రోజా కూడా అయ్యన్నకు గట్టి రిటార్ట్ ఇచ్చారు. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా, నోరు జాగ్రత్త అని హెచ్చరించారు. మొత్తానికి రాజకీయాలు భ్రష్టు పట్టిపోతున్నాయని గోలపెట్టే తమ్ముళు తమ మాజీలు ఎలా మాట్లాడుతున్నారో కూడా చూసుకోవద్దా అని వైసీపీ నేతలు నుంచి కౌంటర్లు పడుతున్నాయి.
ఇంతకీ మాజీ మంత్రి గారు ప్రజా సమస్యలు ప్రస్థావిస్తే బాగుంటుందేమో. మాట్లాడితే ఆరు సార్లు ఎమ్మెల్యే, అయిదు సార్లు మంత్రి, ఒక సారి ఎంపీ అంటున్న ఈ పెద్దాయన తన సీనియారిటీని నిలబెట్టుకునేలా కామెంట్స్ చేస్తే బాగుంటుందేమో అని అంటున్నారు.