అచ్చెన్న ఎక్కడ?

ఏపీలో టీడీపీకి అధ్యక్షుడు ఉన్నారు. ఆయనే కింజరాపు అచ్చెన్నాయుడు. చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు అయినా ఏపీలోనే ఆయన ఉంటారు. కాబట్టి అచ్చెన్నాయుడుకు అంతా కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం పడడంలేదు. బాబు లేకపోతే చినబాబు ఉంటారు…

ఏపీలో టీడీపీకి అధ్యక్షుడు ఉన్నారు. ఆయనే కింజరాపు అచ్చెన్నాయుడు. చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు అయినా ఏపీలోనే ఆయన ఉంటారు. కాబట్టి అచ్చెన్నాయుడుకు అంతా కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం పడడంలేదు. బాబు లేకపోతే చినబాబు ఉంటారు అనుకుంటే ఈ ఇద్దరు అధినేతలూ విదేశాలకు వెళ్ళినట్లుగా ప్రచారంలో ఉంది.

అపుడు ఏపీలో కీ రోల్ ప్లే చేయాల్సింది అచ్చెన్నాయుడే కదా అన్నది అంతా అంటున్న విషయం. అయితే మాజీ మంత్రులు టీడీపీ సీనియర్ నేతలు హడావుడి చేస్తున్నారు. వారే ఈసీని కలుస్తున్నారు. డీజీపీకి లేఖలు రాస్తున్నారు. ప్రెస్ మీట్లు పెడుతున్నారు.

ఇలా హల్ చల్ అంతా వారే చేస్తున్నారు. ఏపీలో టీడీపీకి ప్రెసిడెంట్ ఉన్నారు ఆయన నాయకత్వంలో పనిచేయాలన్న ఆలోచన లేదా అన్న డిస్కషన్ అయితే నడుస్తోంది. అచ్చెన్నాయుడు కూడా పోలింగ్ తరువాత సైలెంట్ అయిపోయారు. ఆయన తన పని తాను అన్నట్లుగా ఉన్నారని అంటున్నారు.

టీడీపీ అధినాయకత్వం లేనపుడు ఏపీ పార్టీకి పెద్ద దిక్కు అచ్చెన్న అన్నది వాస్తవం. కానీ ఆచరణకు వచ్చేసరికి మాత్రం చాలా మంది నేతలు తయారవుతున్నారు. వారే తాము హై కమాండ్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీలో కొత్తగా చేరిన నేతల నుంచి అందరూ మాట్లాడేవారే ఉన్నారు అని అంటున్నారు.

గతంలో చంద్రబాబు జైలుకు వెళ్ళినపుడు కూడా ఇలాగే చాలా మంది నాయకులు వచ్చి హడావుడి చేశారు. అపుడు కూడా అచ్చెన్నాయుడు పాత్రను పరిమితం చేశారు అన్న ప్రచారం సాగింది. ఒక రాజకీయ పార్టీ అన్నాక సంస్థాగతంగా అధ్యక్షుడే కీలకంగా ఉంటారు. కానీ ఏపీలో అందులోనూ టీడీపీలో మాత్రం ఎవరికి వారే లీడర్లు అన్నట్లుగా ఉంది. చంద్రబాబుని చినబాబుని తప్పించి వేరు ఎవరినీ వీరు పట్టించుకునే రకాలు కాదని కూడా అంటున్నారు. అందుకే ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి అంటే ఆరవ వేలుగా మారిందా అని కూడా అంటున్నారు.