ధర్మాన మౌనమేలా…?

ముసలోళ్ళ మాటలను వినద్దు, వారు చెప్పే ఉద్యమాల కబుర్లకు పడొద్దూ అని పవన్ ఒక సందేశం ఇచ్చారు. పవన్ సందేశం ఎందుకు ఇచ్చారు అంటే ఉత్తరాంధ్రా అంటూ ఒకరు, రాయలసీమ అంటూ మరొకరు ఇలా…

ముసలోళ్ళ మాటలను వినద్దు, వారు చెప్పే ఉద్యమాల కబుర్లకు పడొద్దూ అని పవన్ ఒక సందేశం ఇచ్చారు. పవన్ సందేశం ఎందుకు ఇచ్చారు అంటే ఉత్తరాంధ్రా అంటూ ఒకరు, రాయలసీమ అంటూ మరొకరు ఇలా నేతలు ఊసుపోక వేర్పాటు ఉద్యమాల బాట నడుస్తున్నారు అని విమర్శలు చేస్తూ ఈ కామెంట్స్ చేశారు.

దానికి ముందు స్టోరీ చూస్తే అమరావతి రాజధాని అంటే తమకు ఉత్తరాంధ్రా రాష్ట్రం కావాలని సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు కొద్ది రోజుల క్రితం కామెంట్స్ చేశారు. ఇవి సంచలనం రేపాయి. దీని మీద రాయలసీమ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక రాయలసీమ అంటూ డిమాండ్ చేశారు.

ఇపుడు పవన్ వచ్చి అటూ ఇటూ కౌంటర్లేశారు. దానికి బైరెడ్డి బాగానే రియాక్ట్ అయ్యారు. మేము ముసలాళ్ళమా  కొండారెడ్డి బురుజు దగ్గరకు పవన్ వస్తే కుస్తీ పోటీలలో తానో ఆయనో ఎవరి బలం ఏంటో తేలుతుంది అని ఘాటైన కామెంట్స్ చేశారు. అంతే కాదు రాయలసీమ ఉద్యమ చరిత్ర పవన్ కి తెలిసినట్లు లేదని అన్నారు.

ఇపుడు ధర్మాన ప్రసాదరావు మీద అందరి దృష్టి పడింది. వేర్పాటు వాదం అంటే తాను తీవ్రవాదిని అవుతాను అని పవన్ గర్జించడమే కాకుండా ధర్మాన మాటల మీద విరుచుకుపడ్డారు సీమ సెంటిమెంట్ ఉద్యమాలు గురించి పవన్ కి తెలియదు అని బైరెడ్డి ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ లాంటిది ధర్మాన నుంచి ఆశించవచ్చా అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.  

ఉత్తరాంధ్రా చరిత్ర సెంటిమెంట్ వీటి గురించి పవన్ మాటలకైనా జవాబుగా చెప్పాల్సిన బాధ్యత మంత్రి గారికి ఉందా లేదా అన్నదే ప్రశ్న. ఉత్తరాంధ్రా ప్రాంతం వెనకబాటుతనం గురించి పవన్ లాంటి వారికి చెప్పాల్సిన అవసరం లేదా అని అంటున్నారు. లేకపోతే ఊసుపోని ఉద్యమాలు ఉత్తుత్తి మాటలు అని పవన్ అన్నట్లుగానే జనాలు అనుకునే ప్రమాదం ఉంది.