ఆత్మకూరు రిజల్ట్ తోనైనా ప్రతిపక్షాలకు బుద్ధొస్తుందా..?

ఆత్మకూరులో వార్ వన్ సైడ్ అంటున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఆత్మకూరులో లోపాయికారీ ఒప్పందాలతో బీజేపీ అభ్యర్థిని నిలబెట్టి సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నాయి. బద్వేలులో అదే సీన్ జరిగినా పెద్దగా ఫలితం లేదు.  Advertisement ఇప్పుడు…

ఆత్మకూరులో వార్ వన్ సైడ్ అంటున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఆత్మకూరులో లోపాయికారీ ఒప్పందాలతో బీజేపీ అభ్యర్థిని నిలబెట్టి సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నాయి. బద్వేలులో అదే సీన్ జరిగినా పెద్దగా ఫలితం లేదు. 

ఇప్పుడు ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని అంటున్న ప్రతిపక్ష నాయకులు.. కాస్త గట్టిగా ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారు. టీడీపీ, జనసేన దాదాపుగా పోటీకి దూరమే అంటున్నా.. బీజేపీ నిలబెట్టే అభ్యర్థికి సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నాయి. అయితే అక్కడ మేకపాటి విజయం నల్లేరుపై నడకే.

బాదుడే బాదుడు ప్రభావం ఉంటుందా..?

ఏపీలో గడప గడపకు వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు పరాభవం ఎదురవుతుందని ఎల్లో మీడియా గగ్గోలు పెడుతోంది. అదే సమయంలో టీడీపీ బాదుడే బాదుడు అనే ప్రోగ్రామ్ చేపట్టింది. దీనికి బ్రహ్మాండంగా ప్రజలు మద్దతిస్తున్నారని కూడా ఎల్లో మీడియా డప్పు కొడుతోంది. ఇదే నిజమైతే ఆత్మకూరులో ప్రతిపక్షాలే విజయం సాధించాలి. పోనీ కనీసం వైసీపీకి మెజార్టీ తగ్గాలి.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆత్మకూరులో వైసీపీకి తిరుగులేదు. మంత్రిగా గౌతమ్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలు, మేకపాటి కుటుంబంపై ఉన్న అభిమానం విక్రమ్ రెడ్డికి ప్లస్ అవుతాయి. అందులోనూ ఇటీవల గడప గడప కార్యక్రమంలో భాగంగా ఆయన దాదాపు సగం నియోజకవర్గాన్ని చుట్టేశారు. అంటే గౌతమ్ వారసుడిగా విక్రమ్ దాదాపు అందరికీ పరిచయం అయిపోయారు. జగనన్న పథకాలు ఎలాగూ ఉండనే ఉన్నాయి. ఇటీవలే గతుకుల రోడ్లన్నీ అందంగా తయారయ్యాయి.

సో.. ప్రస్తుతానికి నెగెటివ్ ఎలిమెంట్స్ ఏవీ ఆత్మకూరులో లేవు. వైసీపీకి ఘన విజయం ఖాయమంటున్నారు స్థానికులు. మరి ఈ విజయంతో అయినా ప్రతిపక్షాలకు బుద్ధొస్తుందా.. లేక చివర్లో సింపతీతో గెలిచేశారంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారా.. వేచి చూడాలి.